Harika Dronavalli: ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న కల ఫలించింది

స్పెయిన్ వేదికగా జరిగిన FIDE వరల్డ్ ఉమెన్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో శనివారం ఇండియా ఫైనల్ లో 0-2తో ఓటమి చవిచూసింది.

Harika Dronavalli: ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న కల ఫలించింది

Dronavalli Harika

Harika Dronavalli: తాను ఎన్నేళ్లుగానో ఎదురుచూసిన సమయం వచ్చిందని.. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని అంటోంది హారిక ద్రోణవల్లి. స్పెయిన్ వేదికగా జరిగిన FIDE వరల్డ్ ఉమెన్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో శనివారం ఇండియా ఫైనల్ లో 0-2తో ఓటమి చవిచూసింది. హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి, మేరీఆన్‌ గోమ్స్‌లతో కూడిన భారత జట్టుతో బరిలోకి దిగింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పతకం.

ఈ పర్‌ఫార్మెన్స్ తర్వాత హారిక ఎమోషనల్ అయ్యారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న లక్ష్యాన్ని సాధించానని చెప్పారు. ఈ సందర్భంగా ట్వీట్ ద్వారా ఆమె మనోగతాన్ని వెల్లడించారు.

‘2004 నుంచి టీమ్‌ ఈవెంట్స్‌లో ఆడుతున్నా. గతంలో పలుమార్లు పతకానికి చేరువై దూరమయ్యాం. ఒకట్రెండుసార్లు భావోద్వేగానికి లోనై ఏడ్చేశాను కూడా. ఈసారి మాత్రం అనుకున్నది సాధించాం. కెరీర్ లో ఇది గొప్ప ఫలితం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలకు నాంది పలుకుతుందని ఆశిస్తున్నా. వ్యక్తిగతంగానూ ఈ టోర్నీ చిరస్మరణీయంగా నిలిచింది. ఈ టోర్నీ మొత్తంలో 11 గేమ్‌ల్లో బరిలోకి దిగిన ఏకైక ప్లేయర్‌ నేనే. చివరకు అజేయంగా నిలిచి వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించినందుకు ఆనందంగా ఉంది’ అని హారిక వ్యాఖ్యానించింది.

………………………………………… : జగన్‌ను భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు

హారిక 2008లో జూనియర్ వరల్డ్ చెస్ కిరీటం దక్కించుకుంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లోనూ బ్రాంజ్ మెడల్స్ సాధించింది. ఈవెంట్ వరకూ వెళ్లేందుకు సపోర్ట్ అందించిన ఇండియన్ చెస్ ఫెడరేషన్ కు థ్యాంక్స్ చెప్పింది హారిక.

ప్రస్తుత విజయంపై వరల్డ్ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ ద్వారా అభినందనలు తెలియజేశారు. సిల్వర్ అందుకున్నందుకు టీమిండియాకు కంగ్రాట్స్. అని పేర్కొన్నారు.