Pakistan : నాలుగో స్థానంలో నిలిచేందుకు పాకిస్థాన్‌కు అవకాశం.. రెండు మ్యాచులు గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
వరుసగా రెండు విజయాలతో వన్డే ప్రపంచకప్ 2023లో తన ప్రయాణాన్ని ఎంతో గొప్పగా మొదలెట్టింది పాకిస్థాన్. అయితే.. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది.

Pakistan
Pakistan Semis chances : వరుసగా రెండు విజయాలతో వన్డే ప్రపంచకప్ 2023లో తన ప్రయాణాన్ని ఎంతో గొప్పగా మొదలెట్టింది పాకిస్థాన్. అయితే.. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. ఆ తరువాత ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమిని చవిచూసింది. దీంతో ఆరు మ్యాచులు ముగిసే సరికి నాలుగు పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే లీగ్ దశ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో కనీసం నాలుగో స్థానంలోనైనా ఉండాలి. అలా జరగాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో పాకిస్థాన్ ఘన విజయాలు సాధించడంతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి.
మూడు మ్యాచుల్లో గెలిస్తే..
ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లో పాకిస్థాన్ విజయాలు సాధిస్తే అప్పడు ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉంటాయి. దీంతో ఆ జట్టు సెమీస్ చేసే అవకాశాలు మెరుగు అవుతాయి. అయితే.. అదే సమయంలో ఇతర జట్ల పై ఆధారపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్ల ఫలితాలు పాక్‌కు అనుకూలంగా రావాలి.
పట్టికలో 12 పాయింట్లతో ఉన్న భారత్ ఇంకొక్క మ్యాచులో విజయం సాధిస్తే నేరుగా సెమీ ఫైనల్‌కు వెలుతుంది. 10 పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా మరో రెండు మ్యాచుల్లో గెలిస్తే ఆ జట్టు కూడా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ప్రస్తుతం ఆసీస్, కివీస్ లు 8 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్, ఆసీస్‌లు తాము ఆడాల్సిన మిగిలిన మ్యాచులు అన్నీ ఓడిపోవాలి. అఫ్గానిస్థాన్ జట్టు తమకు మిగిలిన మూడు మ్యాచుల్లో ఒకటి లేదా రెండు మ్యాచుల్లో మాత్రమే గెలవాలి. శ్రీలంక కూడా మిగిలిన మ్యాచుల్లో ఒకటి లేదా రెండు గెలవాలి. అప్పుడు పాకిస్థాన్ టాప్-4లోకి అడుగుపెడుతుంది. ఒక వేళ ఈ సమీకరణాలలో ఏవైనా తేడాలు జరిగే మాత్రం పాక్‌కు నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకనే పాక్ మిగిలిన మ్యాచుల్లో భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటి.
మూడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధిస్తే..
ఒక వేళ పాకిస్థాన్ మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిస్తే అప్పుడు పాకిస్థాన్ 8 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా ఉంటాయి. ప్రస్తుతం 8 పాయింట్లతో ఉన్న ఆసీస్, కివీస్ జట్లు మిగిలిన అన్ని మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. 6 పాయింట్ల తో ఉన్న అఫ్గానిస్థాన్ అన్ని మ్యాచుల్లో ఓడిపోవాలి. లేదంటే ఒక్క మ్యాచ్‌కు మించి విజయం సాధించకూడదు. అటు శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు కూడా మిగిలిన మ్యాచుల్లో ఒకటి లేదా రెండు విజయాలు మాత్రమే సాధించాలి. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకం అవుతుంది. మెరుగైన నెట్‌రన్ రేట్ కలిగిన ఉన్న జట్లు సెమీస్‌లో అడుగుపెడతాయి.
మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే..
పాకిస్థాన్ మిగిలిన మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే అప్పుడు పాక్ ఖాతాలో 6 పాయింట్లు ఉంటాయి. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
Mohammed Shami : దిగ్గజాల రికార్డుకు అడుగుదూరంలో షమీ.. ఇదే ఫామ్‌తో ఇంకొక్క మ్యాచ్ ఆడితే..
మూడు మ్యాచుల్లో ఓడిపోతే..
పాకిస్థాన్ మిగిలిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోతే 4 పాయింట్లతో పాకిస్థాన్ ఇంటి బాట పడుతుంది.