Kohli Birthday : బ‌ర్త్ డే రోజున కోహ్లీ సెంచ‌రీ.. పాకిస్థాన్‌ క్రికెటర్ జోస్యం.. 70 వేల ఫేస్ మాస్క్‌లు..!

స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది.

Kohli Birthday : బ‌ర్త్ డే రోజున కోహ్లీ సెంచ‌రీ.. పాకిస్థాన్‌ క్రికెటర్ జోస్యం.. 70 వేల ఫేస్ మాస్క్‌లు..!

Rizwan-Kohli

Updated On : October 31, 2023 / 3:13 PM IST

Virat Kohli birthday : స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా ఆరు మ్యాచులు ఆడ‌గా అన్ని మ్యాచుల్లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను చిత్తు చేసింది. దాదాపుగా సెమీస్ స్థానాన్ని ఖ‌రారు చేసుకుంది. లీగ్ ద‌శ‌లో మ‌రో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇందులో న‌వంబ‌ర్ 5న కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కూడా ఉంది.

కాగా.. న‌వంబ‌ర్ 5కు ఓ ప్ర‌త్యేకత‌ ఉంది. ఆ రోజు కోహ్లీ పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే. 35వ ప‌డిలో అడుగుపెట్ట‌నున్న కోహ్లీకి ఇదే చివ‌రి ప్ర‌పంచ‌క‌ప్ అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ఈ పుట్టిన రోజున సౌతాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో విరాట్ శ‌త‌కం బాదాల‌ని అత‌డి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ సైతం చేరిపోయాడు. మీడియాతో మాట్లాడుతూ కోహ్లీకి ముంద‌స్తుగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. బ‌ర్త్ డే రోజున కింగ్ శ‌త‌కం బాదాల‌ని కోరుకున్నాడు.

MS Dhoni : బంగ్లా ఆటగాళ్లను అలా బోల్తాకొట్టించా.. బంగ్లాతో మ్యాచ్ లో ఫన్నీ సన్నివేశాన్ని వివరించిన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్

విరాట్‌కి ఈ పుట్టిన రోజు మ‌ధుర జ్ఞాప‌కంగా నిలిచిపోవాల‌ని ఆకాంక్షించాడు. బ‌ర్త్ డే రోజున 49వ వ‌న్డే సెంచ‌రీ అందుకుంటాడ‌ని భావిస్తున్న‌ట్లు తెలిపాడు. వ‌న్డేల్లో విరాట్ కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 48 సెంచ‌రీలు చేశాడు. ఈ జాబితాలో స‌చిన్ 49 శ‌క‌తాల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. కోహ్లీ క‌నుక మ‌రో సెంచ‌రీ చేస్తే స‌చిన్ రికార్డును స‌మం చేస్తాడు. ప్ర‌స్తుతం విరాట్ ఉన్న ఫామ్ ప్ర‌కారం ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లోనే అది సాధ్య‌మ‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

70 వేల కోహ్లీ మాస్కులు..

ఇదిలా ఉంటే.. కోహ్లీ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ (క్యాబ్‌) ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. మ్యాచ్‌కు ముందు గానీ, లేదంటే మ్యాచ్ ముగిసిన త‌రువాత గానీ కోహ్లీ చేత కేక్ క‌టింగ్ చేయించాల‌ని భావిస్తోంది. అంతేనా.. మ్యాచ్‌కు హాజ‌రు అయ్యే ప్ర‌తి ఫ్యాన్ కూడా కోహ్లీ ఫేస్ మాస్క్ ధ‌రించేలా దాదాపు 70 వేల ఫేస్ మాస్క్‌ల‌ను అందుబాటులో ఉంచాల‌ని భావిస్తోంది.

Uncle Percy : బిగ్ షాక్‌.. అంకుల్ పెర్సీ కన్నుమూత‌.. సంతాపం తెలిపిన క్రికెట‌ర్లు