David Warner: రొనాల్డోకు మంచి జరిగితే నాకూ ఓకే – డేవిడ్ వార్నర్

ఫుట్ బాల్ సూపర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఇమిటేట్ చేశాడు డేవిడ్ వార్నర్. రీసెంట్‌గా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఫామ్ కనబరిచిన ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్..

David Warner: రొనాల్డోకు మంచి జరిగితే నాకూ ఓకే – డేవిడ్ వార్నర్

David Warner

David Warner: ఫుట్ బాల్ సూపర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఇమిటేట్ చేశాడు డేవిడ్ వార్నర్. రీసెంట్‌గా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఫామ్ కనబరిచిన ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్.. మ్యాచ్ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడాడు.

Euro 2020 ప్రెస్ కాన్ఫిరెన్స్ లో పాపులర్ బేవరేజ్ బ్రాండ్ కోకా-కోలా కంపెనీకి చెందిన రెండు కోక్ బాటిల్స్ పక్కకుపెట్టేశాడు రొనాల్డో. అప్పట్లో అది చాలా పెద్ద విషయమై చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు రొనాల్డొ. ఫలితంగా కంపెనీ షేర్ విలువ కూడా కాస్త పడిపోయింది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ 2021 టోర్నీ గ్రూప్-1లో భాగమైన ఆస్ట్రేలియా, శ్రీలంకలు గురువారం తలపడ్డాయి. మ్యాచ్ తర్వాత వార్నర్ మీడియా కాన్ఫిరెన్స్ కు హాజరయ్యాడు.

సీట్లో కూర్చోగానే సపోర్టింగ్ స్టాఫ్ ను రెండు కోక్ బాటిల్స్ తీసేయనా.. అని అడగ్గా అక్కడే ఉంచాలని చెప్పాడు. మళ్లీ యథాస్థానంలో ఉంచేసి ఇవి క్రిస్టియానోకు మంచివైతే నాకు కూడా మంచివే’ అని కామెంట్ చేశాడు.

 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,: దినేశ్ కార్తీక్‌కు డబుల్ ధమాకా.. దీపికా పల్లికల్‌కు కవలలు

ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ 2021కు ఈ సాఫ్ట్ డ్రింక్ అతి పెద్ద స్పాన్సర్ గా నిలిచింది. ఐసీసీతో ఐదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుని 2023వరకూ ఐసీసీతో కాంట్రాక్ట్ లో ఉంది. రొనాల్డో తర్వాత చాలా మంది ప్లేయర్లు కోకా కోలా బాటిల్స్ ను తీసేసే ధైర్యం చేశారు. ఈ ట్రెండ్ కొనసాగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వహకులు.