Nitish Reddy : అరుదైన ఘనత సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్‌రెడ్డి.. ఎలైట్ జాబితాలో వార్నర్ సరసన..
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల బాట పట్టింది.

PIC Credit@SRH
SRH Nitish Reddy : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల బాట పట్టింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన తరువాత గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. హోం గ్రౌండ్ ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న అతడు మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాది 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. నితీశ్‌తో పాటు ట్రావిస్ హెడ్ (58), క్లాసెన్ (42) లు రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులకు పరిమితమైంది. యశస్వి జైస్వాల్ (67), రియాన్ పరాగ్ (77) మెరుపులు మెరిపించినప్పటికీ ఒక్క పరుగు తేడాతో ఓటమి తప్పలేదు.
Kavya Maran : ఆఖరి బంతికి సన్‌రైజర్స్ విజయం.. ఎగిరిగంతులేసిన కావ్య పాప.. వైరల్
అరుదైన జాబితాలో..
ఈ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. సన్‌రైజర్స్ తరుపున ఒకే మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టిన ఐదో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (2017లో కేకేఆర్ పై), మనీష్ పాండే (2020లో రాజస్థాన్ రాయల్స్ పై), హెన్రిచ్ క్లాసెన్ (20204లో కేకేఆర్ పై), ట్రావిస్ హెడ్ (2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై) లు ఉన్నారు.
మ్యాచ్ ఫలితం పై..
మ్యాచ్ అనంతరం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆఖరి ఓవర్‌ను ఎవరు వేస్తున్నారో అని గమనించాను. ఎప్పుడైతే భువనేశ్వర్ కుమార్ వేస్తున్నాడు అని తెలిసిందో మ్యాచ్ గెలుస్తాం అనే నమ్మకం కుదిరింది. ఎందుకంటే ఇలాంటి ఎన్నో సందర్భాల్లో బౌలింగ్ వేసిన అనుభవం అతడి సొంతం. అయితే.. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు మేం గెలుస్తామని అనుకోలేదు. టై లేదా ఓడిపోతామని భావించాను. అయితే.. భువీ మ్యాజిక్ చేస్తూ వికెట్ తీయడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Rohit Sharma : మీడియా సమావేశం అనంతరం నేరుగా రింకూసింగ్ వద్దకు వెళ్లిన రోహిత్ శర్మ..
ఇక జట్టులో నా పాత్ర ఏమిటన్న దానిపై స్పష్టత ఉంది. త్వరగా వికెట్లు పడినప్పుడు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకోవాలని భావిచాను. కనీసం 14వ ఓవర్ వరకు మరో వికెట్ పడకుండా ఉండాలని జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఆ తరువాత క్లాసెన్, సమద్ భారీ హిట్టింగ్‌తో విరుచుకుపడతారని నాకు తెలుసు. రాజస్థాన్‌ను ఓడించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది అని నితీశ్ రెడ్డి అన్నాడు.