INDvNZ : ఆదివారం టీ20 ఫైనల్ ఫైట్

INDvNZ : ఆదివారం టీ20 ఫైనల్ ఫైట్

కివీస్ పర్యటనలో ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్‌ను ఆడేందుకు టీమిండియా సమాయత్తమైంది. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ వేదికగా ఫిబ్రవరి 10న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవడమే ఉత్తమం. సిరీస్‌లో మొదటిదైన తొలి టీ20లో 80 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందిన టీమిండియా రెండో మ్యాచ్‌లో చక్కగా రాణించి ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను చేజిక్కుంచుకుంది. 

 భారత్.. 2017 తర్వాత ఓడిపోకుండా గతంలో ఆడిన చివరి 9 టీ20లను విజయంతో ముగించింది. శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలలోనూ ఓటమెరుగకుండా దూసుకొచ్చింది. మరో వైపు న్యూజిలాండ్.. పాకిస్తాన్‌తో తలపడిన సిరీస్‍‌లో 3-0తేడాతో చిత్తుగా ఓడిపోయి ఆఖరుగా శ్రీలంకతో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో విజయంతో ముగించింది. 

భారత ప్లేయర్లు రోహిత్ శర్మ (29 బంతుల్లో 50)బాది టీ20 కెరీర్‌లో 16వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అతనికి తోడుగా శిఖర్ ధావన్ 79పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేస్తూ (30బంతుల్లో 29) పరుగులు చేయగలిగాడు. యువ క్రికెటర్ రిషబ్ పంత్ దూకుడైన ఫామ్‌ను చూపించి (28 బంతుల్లో 40)పరుగులు చేశాడు. పాండ్యా బ్రదర్స్ ఏ మాత్రం తగ్గకుండా సత్తా చాటగా కృనాల్ ఒక్కడే వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. 

న్యూజిలాండ్ ప్లేయర్ల ఫామ్ విషయానికొస్తే ఒక్క టిమ్ సీఫెర్ట్ మాత్రమే 43 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు అత్యధిక స్కోరు తెచ్చిపెట్టాడు. రోస్ టేలర్ (36 బంతుల్లో 42)పరుగులు చేసి చక్కటి ఫామ్‌ను ప్రదర్శించారు. వారితో పాటుగా ఫెర్గ్యూసన్ 6వికెట్లు పడగొట్టగా, టిమ్ సౌథీ భారీగా పరుగులు కట్టడి చేస్తున్నాడు. 

తుది జట్లు అంచనా: 
భారత్:

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్

న్యూజిలాండ్:
సీఫెర్ట్, కొలిన్ మన్రో, విలియమ్సన్, మిచెల్, రోస్ టేలర్, గ్రాండ్ హోమ్, నీషమ్, మిచెల్ శాంతర్, టిమ్ సౌథీ, ఇష్ సోదీ, ఫెర్గ్యూసన్

వేదిక: సెడాన్ పార్క్ స్టేడియం, హామిల్టన్
సమయం: టాస్ ఉదయం 11గంటలకు, మ్యాచ్ ఉదయం 11.30గంటలకు 
ప్రసారమయ్యే ఛానెళ్లు: స్కై స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్, హాట్ స్టార్