IPL 2021: ఈ టోర్నమెంట్ కూడా ముంబైకే అనుకూలమా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ది ప్రత్యేక స్థానం. ఐదు సార్లు ట్రోఫీ గెలుచుకున్న ఈ జట్టు..

IPL 2021: ఈ టోర్నమెంట్ కూడా ముంబైకే అనుకూలమా..

Ipl 2021

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ది ప్రత్యేక స్థానం. ఐదు సార్లు ట్రోఫీ గెలుచుకున్న ఈ జట్టు.. గతేడాది ఛాంపియన్ కూడా తానే అయి మరోసారి కిరీటాన్ని చేజిక్కించుకుంది. గత సీజన్లో లాగే ప్రస్తుత సీజన్ కూడా ముంబై ఇండియన్స్ కే అనుకూలంగా కనిపిస్తుంది వాతావరణం.

ప్లేయర్లంతా మంచి ఫామ్ లో కనిపిస్తుండటం జట్టుకు ప్రధాన బలంగా కనిపిస్తుంది. వరుసగా మూడు సార్లు ట్రోఫీ గెలుచుకున్న జట్టుగా నిలవడం ముంబై ఇండియన్స్ కు గొప్ప అవకాశం.

ముంబై జట్టు: రోహిత్ శర్మ, ఆదిత్యా తారె, అన్మోల్ ప్రీతి సింగ్, అనుకుల్ రాయ్, ధావల్ కుల్కర్ణి, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, బుమ్రా, జయంత్ యాదవ్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, క్వింటన్ డికాక్, రాహుల్ చాహర్, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట, క్రిస్ లిన్, సౌరబ్ తివారీ, మోహసీన్ ఖాన్, ఆడం మిల్నే, నాథన్ కౌల్టర్ నైల్, పీయూశ్ చావ్లా, మార్కో జెన్సెన్, యుద్ధవీర్ సింగ్, జేమ్స్ నీషమ్, అర్జున్ టెండూల్కర్

వేలం జరిగిన తీరు
గతేడాది కూడా ముంబై ఇండియన్స్ బలంగానే ఉంది. స్పిన్ బౌలింగ్ డిపార్ట్ మెంట్ లో బలంగా ఉన్న ముంబై జట్టులో కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్,, జయంత్ యాదవ్, అనుకుల్ రాయ్

ముంబై టీం మేనేజ్మెంట్ ఎప్పుడూ తెలివిగానే వ్యవహరిస్తుంది. పీయీష్ చావ్లాను స్పిన్ డిపార్ట్మెంట్ లోకి తీసుకుని స్మార్ట్ గా వ్యవహరించింది. లెగ్ స్పిన్నర్ చాహర్ ను గైడ్ చేయడంలో హెల్ప్ అవుతుంది.

ముంబై ఇండియన్స్ నాథన్ కౌల్టర్ నైల్ ను కాంట్రాక్ట్ కుదించి వెనక్కు తీసుకుంది. ఇంకా ఆడం మిల్నే(రూ.3.2కోట్లు)కు, జేమ్స్ నీషమ్(రూ.50లక్షలు), యుద్ వీర్ చారక్, మార్కో జాన్సెన్, అర్జున్ టెండూల్కర్ లను ప్రారంభధర రూ.20లక్షలకే కొనుగోలు చేసింది.

ఫేస్ అటాకింగ్ లో మిల్నే, తనకు ఆల్టర్నేటివ్ గా కౌల్టర్ నైల్ ఉండటంతో పాటు అవసరమైతే కొన్ని ఓవర్లు అందుకోవడానికి హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు.

ఐపీఎల్ 2021కు బ్యాలెన్స్‌డ్‌గా ముంబై
మోడరన్ టీ20 క్రికెట్ లో బ్యాలెన్సింగ్ గా ఉంది ముంబై. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ వారి కోసం సూపర్ స్టార్లు రెడీ చేసుకున్నప్పటికీ ముంబైనే బెటర్ గా ఉంది.

ముంబై లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ లో కరెక్ట్ గా ఉంది. ఐపీఎల్ 2020లో భారీ స్కోరు సాధించిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లతో పాటు స్ట్రాంగెస్ట్ టాపార్డర్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు, ఇద్దరు రైట్ హ్యాండర్లు ఉండటంతో బలంగా కనిపిస్తుంది.

ఇక మిగిలిన బెస్ట్ ఫినిషర్స్ గా హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లు ఉండటమే కాక 6, 7 పొజిషన్లలో మంచి బౌలింగ్ ఆప్షన్ తో కనిపిస్తుంది. కృనాల్ పాండ్యా ఓ లెఫ్ట్ హ్యాండ్ లోయర్ మిడిలార్డర్ బౌలింగ్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు నాథన్ కౌల్టర్ నైల్, జిమ్మీ నీషంలు 8వ స్థానంలో దిగేందుకు రెడీగా ఉన్నారు.

బౌలింగ్ డిపార్ట్మెంట్ లో బుమ్రా, బౌల్ట్ లెఫ్ట్-రైట్ కాంబినేషన్ లో పవర్ ప్లేలో, డెత్ ఓవర్లలో వికెట్లు తీస్తూ అదరగొట్టేస్తున్నారు.

ముంబై ఇండియన్స్ మెంటాలిటీ
ముంబై ఇండియన్స్ కు గెలవడం అనేది ఆరోగ్యకరమైన అలవాటుగా మారిపోయింది. రోహిత్ శర్మ లీడర్ షిప్ లో ఎక్స్ టార్డినరీగా దూసుకెళ్తోంది. లీగ్ లో ఎనిమిది సీజన్లుగా ఎప్పుడూ స్లో కాకుండా ఆడుతోంది ముంబై. గత సీజన్ ఆ జట్టుకు మాంచి కంఫర్ట్ గా కనిపించింది.

ముంబై ఇండియన్స్ కేవలం ఆరు ఫైనల్స్ లో మాత్రమే ఓటమి చవిచూసింది. ఇక ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన ముంబై.. ఆరో సారి కూడా గెలిచి రికార్డు దక్కించుకునేందుకు రెడీగా ఉంది.