IPL 2021: సీజన్ల వారీగా విజేతలు వీరే

కొద్ది సీజన్లుగా ఎన్ని మార్పులు జరుగుతున్నా తేడా లేకుండాపోయింది. 2008 నుంచి సీజన్ విజేతలు ఎవరో ఓసారి లుక్కేద్దాం..

IPL 2021: సీజన్ల వారీగా విజేతలు వీరే

Ipl 2021

IPL 2021: క్రికెట్ షార్ట్ ఫార్మాట్ ఫెస్టివల్ వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో దేశంలోని పలు స్టేడియాల్లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు గల్లీ నుంచి అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు. ఈ కోట్లలో కొనుగోలు చేసిన ప్లేయర్లతో సందడి చేసే ఫ్రాంచైజీలు పకడ్బంధీ వ్యూహాలతో బరిలోకి దిగి అలరించనున్నాయి. ఇప్పటికే అన్ని టీంలు ట్రైనింగ్ క్యాంపుకు వచ్చేశాయి.

2008లో ఆరంభమైన ఈ మెగా టోర్నీ.. 2021వరకూ మరే దేశీవాలీ లీగ్ సాధించుకోనంత క్రేజ్ తో దూసుకెళ్తుంది. ఇక సీజన్ల వారీగా అత్యధికంగా 5సార్లు ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలుచుకుంటే.. డెక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారి మాత్రమే ట్రోఫీని ముద్దాడాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రోఫీ ఛాలెంజింగ్ గానే మిగిలిపోయింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఖాతాలో ఒక్క ట్రోఫీ కూడా లేదు. ఢిల్లీలో కొద్ది సీజన్లుగా ఎన్ని మార్పులు జరుగుతున్నా తేడా లేకుండాపోయింది. 2008 నుంచి సీజన్ విజేతలు ఎవరో ఓసారి లుక్కేద్దాం..

 

 

Year Winner Season
2021 TBD 14
2020 Mumbai Indians 13
2019 Mumbai Indians 12
2018 Chennai Super Kings 11
2017 Mumbai Indians 10
2016 Sunrisers Hyderabad 9
2015 Mumbai Indians 8
2014 Kolkata Knight Riders 7
2013 Mumbai Indians 6
2012 Kolkata Knight Riders 5
2011 Chennai Super Kings 4
2010 Chennai Super Kings 3
2009 Deccan Chargers 2
2008 Sunrisers Hyderabad 1