IPL 2023: పంజాబ్‌పై ఢిల్లీ విజ‌యం

ఐపీఎల్ 2023లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది.

IPL 2023: పంజాబ్‌పై ఢిల్లీ విజ‌యం

PBKS vs DC

PBKS vs DC: ఐపీఎల్ 2023లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 17 May 2023 11:18 PM (IST)

    ఢిల్లీ విజ‌యం

    ఐపీఎల్ 2023లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. లియామ్ లివింగ్ స్టోన్ (94), అథర్వ తైడే(54) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు.

  • 17 May 2023 10:55 PM (IST)

    షారుక్ ఖాన్‌ ఔట్

    పంజాబ్ మ‌రో వికెట్ కోల్పోయింది. ఖ‌లీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో అక్ష‌ర్ ప‌టేల్ క్యాచ్ అందుకోవ‌డంతో షారుక్ ఖాన్‌(6) ఔట్ అయ్యాడు. దీంతో 147 ప‌రుగుల(16.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది.

  • 17 May 2023 10:51 PM (IST)

    జితేశ్ శ‌ర్మ డ‌కౌట్

    అథర్వ తైడే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిర‌గ‌గా నోర్జే బౌలింగ్‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ క్యాచ్ అందుకోవ‌డంతో జితేశ్ శ‌ర్మ డ‌కౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 129 ప‌రుగుల‌(15.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 17 May 2023 10:33 PM (IST)

    అథర్వ తైడే అర్ధ‌శ‌త‌కం

    13వ ఓవ‌ర్‌ను నోర్జే వేయ‌గా ఐదో బంతికి రెండు ప‌రుగులు తీసి 38 బంతుల్లో అథర్వ తైడే అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

  • 17 May 2023 10:10 PM (IST)

    ప్రభసిమ్రాన్ సింగ్ ఔట్‌

    పంజాబ్ మ‌రో వికెట్ కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో ప్ర‌భ‌సిమ్రాన్ సింగ్ ఔట్ అయ్యాడు. దీంతో 50 ప‌రుగుల(6.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 51/2. లివింగ్ స్టోన్‌(1), అథర్వ తైడే(25)లు క్రీజులో ఉన్నారు.

  • 17 May 2023 09:44 PM (IST)

    ధావ‌న్ ఔట్

    భారీ ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన పంజాబ్ జ‌ట్టుకు ఆదిలోనే షాక్ త‌గిలింది. కెప్టెన్‌, ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. ఇషాంత్ శ‌ర్మ వేసిన రెండో ఓవ‌ర్‌లోని తొలి బంతికి అమ‌న్ ఖాన్ చేతికి చిక్కాడు. దీంతో స్కోరు బోర్డుపై ఒక్క ప‌రుగు చేర‌క‌ముందే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది.

  • 17 May 2023 09:10 PM (IST)

    పంజాబ్ ల‌క్ష్యం 214

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 213 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో రిలీ రూసో( 82 నాటౌట్; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), పృథ్వీ షా(54; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కాల‌తో అల‌రించ‌గా, డేవిడ్ వార్న‌ర్(46; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. ఆఖ‌ర్లో ఫిలిఫ్ సాల్ట్ (26నాటౌట్; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో సామ్‌క‌ర‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

  • 17 May 2023 08:59 PM (IST)

    రిలీ రొసో అర్ధ‌శ‌త‌కం

    రిలీ రొసో దూకుడుగా ఆడుతున్నాడు. 25 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని బాదేశాడు. 17వ ఓవ‌ర్‌ను నాథ‌న్ ఎల్లిస్ వేయ‌గా రెండో బంతికి రెండు ప‌రుగులు తీసి హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు.

  • 17 May 2023 08:50 PM (IST)

    పృథ్వీ షా ఔట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. సామ్ క‌ర‌న్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన పృథ్వీ షా(54) అథర్వ టైడే చేతికి చిక్కాడు. దీంతో ఢిల్లీ 148 ప‌రుగుల(14.6వ ఓవ‌ర్‌) వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

  • 17 May 2023 08:44 PM (IST)

    పృథ్వీ షా అర్ధ‌శ‌త‌కం

    పృథ్వీ షా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవ‌ర్‌ను రాహుల్ చాహ‌ర్ వేయ‌గా నాలుగో బంతికి సింగిల్ తీసి 36 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు.

  • 17 May 2023 08:32 PM (IST)

    వార్న‌ర్ ఔట్‌

    ఎట్ట‌కేల‌కు పంజాబ్ బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. సామ్ క‌ర‌న్ బౌలింగ్‌లో డేవిడ్ వార్న‌ర్ (46) ధావ‌న్‌ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 94 ప‌రుగుల(10.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

  • 17 May 2023 08:02 PM (IST)

    ధాటిగా ఆడుతున్న ఢిల్లీ బ్యాట‌ర్లు

    టాస్ ఓడిన ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ పృథ్వీ షా ధాటిగా ఆడుతున్నారు. ప‌వ‌ర్ ప్లే ముగిసింది. 6 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 61/0. డేవిడ్ వార్న‌ర్ 18 బంతుల్లో 34, పృథ్వీ షా 18 బంతుల్లో 26 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

  • 17 May 2023 07:24 PM (IST)

    పంజాబ్ కింగ్స్ తుది జ‌ట్టు

    శిఖర్ ధావన్(కెప్టెన్‌), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), సామ్ క‌ర్రాన్‌, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్

  • 17 May 2023 07:24 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ తుది జ‌ట్టు

    డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), రిలీ రొసో, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

  • 17 May 2023 07:22 PM (IST)

    టాస్ గెలిచిన పంజాబ్‌

    కీల‌క మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ధావ‌న్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం పంజాబ్‌కు చాలా ముఖ్యం.