ఆఖరి ఓవర్లో ఎలా ఆడాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం: Pollard

ఆఖరి ఓవర్లో ఎలా ఆడాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం: Pollard

Mumbai Indians ఆఖరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో ఇటువంటి ప్రదర్శన చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు Mumbai Indians ఆల్‌రౌండర్‌ కీరన్‌ Pollard‌ (47; 20 బంతుల్లో) చెప్పాడు. హార్దిక్‌ పాండ్య (30; 11 బంతుల్లో) అదేజోరు మీద రెచ్చిపోయాడని పేర్కొన్నాడు. చివరి మ్యాచ్‌ లో ఓడిపోవడంతో గెలవాలనే కసితో ఆడామని వివరించాడు.

అబుదాబి వేదికగా గురువారం రాత్రి Kings XI Punjab‌పై Mumbai Indians ఘన విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచిన రాహుల్‌ Mumbai Indiansని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పరుగులేమీ రాకుండానే డికాక్‌ (0; 5 బంతుల్లో) వికెట్‌ చేజార్చుకోవడం, ఆ తర్వాతే సూర్యకుమార్‌(10; 7 బంతుల్లో) సైతం త్వరగా రనౌట్‌ అవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది.



ఈ సమయంలో రోహిత్‌ శర్మ (70; 45 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సులు) నిలబడ్డాడు. ఇషాన్‌ కిషన్‌ (28; 32 బంతుల్లో) నెమ్మదిగా ఆడాడు. 14 ఓవర్లకు Mumbai Indians 87/3తో నిలిచింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌-పాండ్యా విరుచుకుపడ్డారు. వరుస బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగిపోయారు. ఆఖరి 4 ఓవర్లలో 89 పరుగులు సాధించారు. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన ఆఖరి ఓవర్లో 25 పరుగులు చేసి పంజాబ్‌కు 192 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. బదులుగా రాహుల్‌ సేన 143/8కే పరిమితమైంది.




‘గెలిచినందుకు సంతోషంగా ఉంది. గత మ్యాచ్‌లలో ఓడిపోయాం. ఈ మ్యాచ్‌లో విజయం వైపు ఉండాలని కోరుకున్నాం. ముందు ఎవరున్నారన్నదే ముఖ్యం. బౌలర్లను చూసి ఎన్ని పరుగులు రాబట్టాలో నిర్ణయించుకోవాలి. ఓవర్లో 15 పరుగులు కావాలంటే బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించాలి. ఈ రోజు హార్దిక్‌ జోరుమీద కనిపించాడు. అతడి బ్యాటు స్వింగ్‌ సైతం చాలా బాగుంది. ఆఖరి 4 ఓవర్లలో ఎలా ఆడాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడైతే విజయం లభించింది కానీ మున్ముందు కీలక మ్యాచులు ఆడాల్సి ఉంది’ అని పొలార్డ్‌ వెల్లడించాడు.