Ishan Kishan: లవర్ కోసం వరల్డ్ కప్ టీంలో స్థానం దక్కించుకున్న ఇషాన్

రీసెంట్‌గా టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్‌.. ప్రముఖ మోడల్‌ అదితి హుండియాతో ప్రేమలో..

Ishan Kishan: లవర్ కోసం వరల్డ్ కప్ టీంలో స్థానం దక్కించుకున్న ఇషాన్

Aditi Ishan Kishan

Updated On : September 11, 2021 / 12:22 PM IST

Ishan Kishan: బాలీవుడ్ హీరోయిన్లు.. టీమిండియా క్రికెటర్ల లవ్ స్టోరీ కొన్నేళ్లుగా కొనసాగుతుంది. విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ, పాండ్యా – నటాషాలు ప్రేమతో ఒకటై సంతానం వరకూ వెళితే మరికొన్ని డేటింగ్ లతోనే ఆగిపోయాయి. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లు కూడా వారి పార్ట్‌నర్స్ తో  దాదాపు ప్రేమలోనే ఉన్నారు. ఇప్పుడు ఇదే జాబితాలో చేరిపోయాడు 23ఏళ్ల ముంబై ఇండియన్స్ క్రికెటర్ ఇషాన్ కిషన్.

రీసెంట్‌గా టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్‌.. ప్రముఖ మోడల్‌ అదితి హుండియాతో ప్రేమలో ఉ‍న్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇషాన్ తొలిసారి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు అదితి ప్రత్యేకంగా అభినందించింది. విష్ చేయడం వల్లే ఇషాన్ సత్తా చాటాడంటూ అప్పట్లో తెగ ట్రోల్‌ చేశారు.

ఇషాన్‌ ఏకంగా వరల్డ్ కప్ టీంకు ఎంపిక అవడంతో.. ప్రేయసి కోసం కష్టపడి చోటు దక్కించుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. 2019 ఐపీఎల్‌లో చెన్నైతో మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇషాన్-అదితి హుండియాల మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

Ind vs Eng: ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదో టెస్టు రద్దు

ఆ మ్యాచ్ లో ఇషాన్ ప్రదర్శనకు ఫిదా అయిన అదితి.. ‘నిన్ను చూసి నేనెంతగానో గర్వపడుతున్నాను బేబీ’ అని తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇషాన్‌ను బేబీ అని సంబోధించడంలో అర్ధమేంటో అంటూ అప్పట్లో నెటిజన్లు రచ్చ రచ్చ చేశారు. అదితి హుండియా.. 2017లో మిస్‌ రాజస్థాన్‌గా ఎంపికైంది.

 

Also Read: PM Jecinda Shock : ప్రధాని ప్రెస్‌మీట్‌లో రొమాన్స్ ప్రశ్న..షాకింగ్ రియాక్షన్ వైరల్