Jaydev Unadkat: రంజీట్రోఫీలో జయదేవ్ ఉనద్కత్ సంచలనం.. మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్

ఈ మ్యాచ్‌లో ఉనద్కత్ హ్యాట్రిక్ వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. మ్యాచ్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. దీంతో ఢిల్లీ మొదటి రోజు 35 ఓవర్లలోనే 133 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్ అవ్వడం మరో విశేషం.

Jaydev Unadkat: రంజీట్రోఫీలో జయదేవ్ ఉనద్కత్ సంచలనం.. మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్

Jaydev Unadkat: రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర కెప్టెన్, బౌలర్ జయదేవ్ ఉనద్కత్ సంచలనం సృష్టించాడు. మ్యాచ్ తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించాడు. రంజీ మ్యాచ్‌లో ఇలా మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా సోమవారం సౌరాష్ట్ర-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది.

Gayathri Raghuram: అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు: తమిళనాడు నేత గాయత్రి రఘురాం

ఈ మ్యాచ్‌లో ఉనద్కత్ హ్యాట్రిక్ వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. మ్యాచ్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. దీంతో ఢిల్లీ మొదటి రోజు 35 ఓవర్లలోనే 133 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్ అవ్వడం మరో విశేషం. ఇందులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఉనద్కత్ బౌలింగ్‌లోనే డకౌట్ అయ్యారంటే అతడు ఎలా విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ఆలౌటైన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సరికి 46 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి, 184 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ సెంచరీతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. చిరాగ్ జానీ 44 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Uttar Pradesh: వేరే వర్గం వాళ్లతో మాట్లాడినందుకు ఇద్దరిపై దాడి.. ఒకరు మృతి

బౌలర్‌గా కొంత కాలం నుంచి దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న ఉనద్కత్ ఇటీవల టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో అతడికి ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా చోటు దక్కింది. రెండో టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. ఇక్కడ సౌరాష్ట్ర కెప్టెన్‌గా కూడా కొనసాగుతున్నాడు. మ్యాచ్ తొలి ఓవర్లో బౌలింగ్ చేసిన ఉనద్కత్ వరుసగా ధృవ్ షోరే, వైభవ్ రావల్‌, యష్ ధుల్‌ను ఔట్ చేశాడు.

దీంతో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్లో కూడా అద్భుత బౌలింగ్ చేసి మరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఉనద్కత్ మొదటి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో 39 పరుగులిచ్చి, 8 వికెట్లు తీశాడు. ఢిల్లీని తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు.