Uttar Pradesh: వేరే వర్గం వాళ్లతో మాట్లాడినందుకు ఇద్దరిపై దాడి.. ఒకరు మృతి

ఉత్తర ప్రదేశ్, బరేలి జిల్లా, బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. షారుఖ్ షేఖ్ అనే 20 ఏళ్ల యువకుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటాడు. షారుఖ్ పని చేసే చోట అతడికి స్నేహితులు ఉన్నారు. వాళ్లు వేరే వర్గానికి చెందిన వాళ్లు. అయితే, అప్పుడప్పుడూ షారుఖ్‌తోపాటు అతడి ఇంటికి వచ్చి వెళ్తుంటారు.

Uttar Pradesh: వేరే వర్గం వాళ్లతో మాట్లాడినందుకు ఇద్దరిపై దాడి.. ఒకరు మృతి

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. వేరే వర్గానికి చెందిన వ్యక్తులతో మాట్లాడినందుకు ఒక యువకుడితోపాటు, అతడి తండ్రిపై అదే వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Bengaluru: యూనివర్సిటీలో యువతి హత్య.. పెళ్లికి ఒప్పుకోనందుకు కత్తితో పొడిచి చంపిన యువకుడు

ఉత్తర ప్రదేశ్, బరేలి జిల్లా, బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. షారుఖ్ షేఖ్ అనే 20 ఏళ్ల యువకుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటాడు. షారుఖ్ పని చేసే చోట అతడికి స్నేహితులు ఉన్నారు. వాళ్లు వేరే వర్గానికి చెందిన వాళ్లు. అయితే, అప్పుడప్పుడూ షారుఖ్‌తోపాటు అతడి ఇంటికి వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో వాళ్లు ఇటీవల షారుఖ్ ఇంటి వద్దకు వచ్చి, సరదాగా అతడితో మాట్లాడుతున్నారు. ఇది చూసిన షారుఖ్ వర్గానికి చెందిన రషీద్, అన్షు ఖాన్, ఫయ్యం, ఫాజిల్ అనే నలుగురు ఈ విషయంపై షారుఖ్‌ను, అతడి స్నేహితుల్ని ప్రశ్నించారు. వాళ్లపై దాడి చేశారు. అయితే, షారుఖ్ స్నేహితులు అక్కడ్నుంచి పారిపోయారు. వాళ్లకు దొరికిన షారుఖ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది చూసిన షారుఖ్ తండ్రి మొహమ్మద్ సర్తాజ్, ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

Gayathri Raghuram: అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు: తమిళనాడు నేత గాయత్రి రఘురాం

అయితే, నిందితులు సర్తాజ్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్‌తో దాడి చేశారు. వెంటనే అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే అతడు మరణించాడు. షారుఖ్ తీవ్ర గాయాలపాలయ్యడు. ఈ ఘటనపై షారుఖ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు, షారుఖ్ ఇంటి సమీపంలోనే ఉంటారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నాడు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గతంలో కూడా నిందితులు వేరే వాళ్లతో మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తమను హెచ్చరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షారుఖ్ కుటుంబం కోరుతోంది.