MS Dhoni: కోహ్లీ కెప్టెన్సీపై ఎంఎస్ ధోనీ రేటింగ్.. వైరల్‌గా మారిన వీడియో

రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న నాటి నుంచి కోహ్లీకి సపోర్టింగ్ కామెంట్లు పెరిగాయి. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత మూడు ఫార్మాట్లలో భారత అంతర్జాతీయ జట్టును కెప్టెన్ గా...

MS Dhoni: కోహ్లీ కెప్టెన్సీపై ఎంఎస్ ధోనీ రేటింగ్.. వైరల్‌గా మారిన వీడియో

Ms-Dhoni

MS Dhoni: రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న నాటి నుంచి కోహ్లీకి సపోర్టింగ్ కామెంట్లు పెరిగాయి. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత మూడు ఫార్మాట్లలో భారత అంతర్జాతీయ జట్టును కెప్టెన్ గా నడిపించిన కోహ్లీని పక్కకు పెట్టేసి రోహిత్ కే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అందించడంపై సోషల్ మీడియాలో సైతం పలు విమర్శలు మొదలయ్యాయి. గతంలో కోహ్లీ కెప్టెన్సీపై ధోనీ ఇచ్చిన రేటింగ్ వీడియో కూడా వైరల్ అయింది.

2018లో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ .. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతున్న సమయంలో తీసిన వీడియో అది. అందులో ముందుగా నార్మల్ ప్లేయర్, కెప్టెన్ కు మధ్య తేడా గురించి చెప్పిన ధోనీ ఆ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ గురించి రేటింగ్ ఇస్తూ.. ‘హీ ఈజ్ వెరీ గుడ్’ అని కామెంట్ చేశాడు.

ఇప్పుడు అదే వీడియో వైరల్ అవుతుండగా.. కోహ్లీ వైట్ బాల్ కెప్టెన్సీ కోల్పోవడంపై సానుభూతి కురుస్తుంది. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడంపై మాజీ కెప్టెన్ గంగూలీ కూడా వివరణ ఇచ్చాడు. రెండు వైట్ బాల్ ఫార్మాట్లకు ఇద్దరు వైట్ బాల్ కెప్టెన్లు ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చాడు.

……………………………..: బాప్ రే.. తారక్ వాచ్ నాలుగు కోట్లా?!