Senior One-Day Trophy : మహిళల వన్డే క్రికెట్ : నాగాలాండ్‌పై ముంబై విక్టరీ.. 4 బంతుల్లోనే విజయం

మహిళల క్రికెట్‌‌లో ముంబై జట్టు రికార్డు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో 4 బంతుల్లోనే ముంబై విజయం సాధించింది. సీనియర్ వన్డే ట్రోఫీలో భాగంగా ముంబై, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ జరిగింది.

Senior One-Day Trophy : మహిళల వన్డే క్రికెట్ : నాగాలాండ్‌పై ముంబై విక్టరీ.. 4 బంతుల్లోనే విజయం

Spain Set To Try A Four Day Working Week Amid Covid 19 Burnout (2)

Mumbai Chase Down Target in 4 Balls : మహిళల క్రికెట్‌‌లో ముంబై జట్టు రికార్డు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో 4 బంతుల్లోనే ముంబై విజయం సాధించింది. సీనియర్ వన్డే ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా ముంబై, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ జరిగింది. అయితే ఈ మ్యాచ్ కేవలం నిమిషాల వ్యవధిలో ముగిసింది.

ముంబై మహిళా జట్టులో బౌలర్ల ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టును 17 పరుగులకే ఆలౌట్‌ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నాగాలాండ్ జట్టు 17.4 ఓవర్లలో 17 పరుగలకే చాపచుట్టేసింది. నాగాలాండ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే ముంబై ఛేదించి రికార్డు నెలకొల్పింది.

సయాలీ ధాటికి నాగాలాండ్‌ ఆటగాళ్లలో ఒకరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్‌ని నమోదు చేయలేదు. సయాలీకి తోడుగా దాక్షిణి (2/12), ఎస్‌. థాకోర్‌ (1/0) పరుగులతో రాణించారు. కేవలం 4 బంతుల్లోనే విజయాన్ని నమోదు చేశారు.

ఓపెనర్‌ ఇషా ఓజా, వృషాలీ భగత్‌ వరుసగా మూడు బౌండరీలు, సిక్సర్‌ తో రెచ్చిపోయారు. మరో 49.2 ఓవర్లు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో ముంబై గెలిచింది. సయాలికి ‘ప్లేయర్‌ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ‌