Prithvi Shaw Selfie Row: మరో మలుపు తిరిగిన సెల్ఫీ వివాదం.. పృథ్వీ షాపై క్రిమినల్ కేసు పెట్టిన నటి

Prithvi Shaw Selfie Row:  టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ వివాదం మరో మలుపు తిరిగింది. భోజ్‌పురి నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్‌ సోమవారం పృథ్వీ షాపై క్రిమినల్ కేసు పెట్టింది.

Prithvi Shaw Selfie Row: మరో మలుపు తిరిగిన సెల్ఫీ వివాదం.. పృథ్వీ షాపై క్రిమినల్ కేసు పెట్టిన నటి

Prithvi Shaw Selfie Row:  టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ వివాదం మరో మలుపు తిరిగింది. భోజ్‌పురి నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్‌ సోమవారం పృథ్వీ షాపై క్రిమినల్ కేసు పెట్టింది. బెయిల్ పై విడుదలైన రోజే ముంబై ఎయిర్ పోర్ట్ పోలీసులను ఆమె ఆశ్రయించింది. పృథ్వీ షా, అతడి స్నేహితులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సప్నా గిల్‌ ఫిర్యాదు మేరకు పృథ్వీ షా, అతడి స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 120b, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

పృథ్వీ షాపై కారుపై బేస్ బాల్ బ్యాట్‌తో దాడి చేశారనే ఆరోపణలతో సప్నా గిల్‌, ఆమె స్నేహితుడు శోబిత్ ఠాకూర్‌ ను పోలీసులు గతవారం అరెస్ట్ చేశారు. ముంబైలోని అంధేరీ కోర్టు వీరికి ఫిబ్రవరి 20 వరకు కస్టడీ విధించింది. మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విన్నపాన్ని మేజిస్ట్రేట్ తిరస్కరించి, ఆమెకు బయిల్ మంజూరు చేశారు. బెయిల్ పై వచ్చిన వెంటనే పృథ్వీ షాపై సప్నా గిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను జైలుకు పంపినందుకు కౌంటర్ గా ఆమె కేసు పెట్టింది.

Also Read: పృథ్వీ షా ఎవరో తెలియదు.. మేము ఇద్దరే ఉన్నాం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సప్నా గిల్‌

ఫిబ్రవరి 15న ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలోని హోటల్ వెలుపల జరిగిన గొడవ కారణంగా సప్నా గిల్ జైలుపాలయింది. సెల్ఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో పృథ్వీ షా కారుపై సప్నా గిల్‌, ఆమె స్నేహితుడు శోబిత్ ఠాకూర్‌ దాడి చేశారని కేసు నమోదైంది. పృథ్వీ షా స్నేహితుడు ఆశిష్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 143, 148, 384, 506 కింద పోలీసులు కేసు పెట్టారు. తనను చంపుతామని కూడా బెదిరించారని ఆశిష్ యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.