PV Sindhu: అనుమతి లేకుండా సింధు పేరును, ఫొటోను యాడ్స్‌లో వాడిన 15కంపెనీలకు నోటీసులు

ఒలింపిక్స్ కాంస్యం పతకం గెలిచొచ్చిన సింధు 15కంపెనీలకు నోటీసులు పంపింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకం సాధించడంతో ఈ మూమెంట్ ను వాడేసుకున్నాయి ప్రముఖ కంపెనీలు. అడ్వర్టైజ్మెంట్ లో ఆమెను సంప్రదించకుండానే ఫొటోలు వాడాయి. ఈ మేరకు స్పోర్ట్స్ మార్కెటింగ్ ఫార్మ్ బేస్‌లైన్ వెంచర్స్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు నోటీసులు పంపించారు.

PV Sindhu: అనుమతి లేకుండా సింధు పేరును, ఫొటోను యాడ్స్‌లో వాడిన 15కంపెనీలకు నోటీసులు

Sindhu Notice

PV Sindhu: ఒలింపిక్స్ కాంస్యం పతకం గెలిచొచ్చిన సింధు 15కంపెనీలకు నోటీసులు పంపింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకం సాధించడంతో ఈ మూమెంట్ ను వాడేసుకున్నాయి ప్రముఖ కంపెనీలు. అడ్వర్టైజ్మెంట్ లో ఆమెను సంప్రదించకుండానే ఫొటోలు వాడాయి. ఈ మేరకు స్పోర్ట్స్ మార్కెటింగ్ ఫార్మ్ బేస్‌లైన్ వెంచర్స్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు నోటీసులు పంపించారు.

‘Happydent (హ్యాపీడెంట్), (పాన్ బహార్)Pan Bahar, (యూరేకే ఫోర్బ్స్)Eureka Forbes, (ఐసీఐసీఐ బ్యాంక్)ICICI Bank, (హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్)HDFC Bank, (వొడాఫోన్ ఐడియా)Vodafone Idea, (ఎంజీ మోటార్)MG Motor, (యుకో బ్యాంక్)UCO Bank, (పంజాబ్ నేషనల్ బ్యాంక్)PNB, (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)SBI, (కొటక్ మహీంద్రా బ్యాంక్)Kotak Mahindra Bank, (ఫినో పేమెంట్స్ బ్యాంక్)Fino Payments Bank, (బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర)Bank of Maharashtra, (ఇండియన్ బ్యాంక్)Indian Bank, (విప్రో లైటింగ్)Wipro Lightingలు ఈ లిస్ట్ లో ఉన్నాయి.

ఈ కంపెనీలన్నీ.. సింధును సోషల్ మీడియాలో కాంస్యం గెలిచినందుకు కంగ్రాట్స్ చెబుతూ.. ఆమె పేరును, పిక్చర్లను వాడుకోవడంతో పాటు దానిపైన కంపెనీ లోగోను కూడా పోస్టు చేశాయి. ఈ క్షణాన్ని మార్కెటింగ్ చేసుకోవాలని ప్లాన్ చేసే ఇలా చేశాయని అథ్లెట్ పేరును, ఫొటోలను అనుమతి లేకుండా వాడడం సబబు కాదని చెప్తున్నారు.

ఇలా పోస్టులు చేయడం కారణంగా మెగా ఈవెంట్ లో తనకు స్పాన్సర్ చేసిన వారికి కూడా థ్యాంక్స్ చెప్పలేకపోయారు పీవీ సింధు. ఐఓఏ (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్)అనుమతి లేకుండా ప్రచారం చేయడం కుదరకపోవడంతో స్పాన్సర్ చేసిన వారెవ్వరూ కంగ్రాచ్యులేటరీ పోస్టు చేయలేకపోయారు. ప్రతిగా సింధు కూడా వారికి థ్యాంక్స్ చెప్పడం కుదరలేదని టాలెంట్ అండ్ పార్టనర్‌షిప్స్ ఎట్ బేస్‌లైన్ వెంచర్స్ డైరక్టర్ యశ్వంత్ బియ్యాలా తెలిపారు.

‘ఇలాంటి మూమెంట్ ను వాడేసుకోవడం ఇదే తొలిసారి కాదు. వారందరికీ నోటీసులు పంపించాం. ఫ్యామస్ అయిన వ్యక్తులు, సెలబ్రిటీలు వారి పేరును, పిక్చర్ ను వాడుకోవడానికి అనుమతి పొందాల్సి ఉంటుంది. వారికి పర్సనాలిటీ రైట్స్, పబ్లిసిటీ రైట్స్ అనేవి ఉంటాయి. పర్మిషన్ లేదా లైసెన్స్ తీసుకుని సెలబ్రెటీల పేరు, పిక్చర్ లాంటివి వాడుకోవాలని సూచిస్తున్నా’ అని ఆయన అన్నారు.