R Ashwin: బౌలింగ్‌లో నెంబర్ వన్ స్థానానికి అశ్విన్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన స్పిన్నర్

ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను దాటి బౌలర్లలో అశ్విన్ అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో కంటే తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. ఏడు స్థానాలు ఎగబాకిన కోహ్లీ ప్రస్తుతం బ్యాట్స్‌మెన్లలో 13వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

R Ashwin: బౌలింగ్‌లో నెంబర్ వన్ స్థానానికి అశ్విన్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన స్పిన్నర్

R Ashwin: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రవి చంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను దాటి బౌలర్లలో అశ్విన్ అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో కంటే తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. ఏడు స్థానాలు ఎగబాకిన కోహ్లీ ప్రస్తుతం బ్యాట్స్‌మెన్లలో 13వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

MLA Sandra Venkata Veeraiya: దమ్ముంటే నాపై పోటీ చెయ్.. పిడమర్తి రవికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సవాల్

భారత ఆటగాళ్లకు సంబంధించి బ్యాటింగ్‌లో టాప్ టెన్‌లో ఇద్దరు ఉన్నారు. రిషబ్ పంత్ 9వ స్థానంలో, కెప్టెన్ రోహిత్ శర్మ పదో స్థానంలో నిలిచారు. ఇటీవలి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో, ఆస్ట్రేలియాపై అశ్విన్ అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 25 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. దీంతో అశ్విన్ టాప్ ర్యాంక్‌లోకి దూసుకెళ్లాడు. అశ్విన్ 869 పాయింట్లు సాధించి, ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. రెండో ర్యాంకు సాధించిన ఆండర్సన్ 859 పాయింట్లు సాధించాడు. అంతకుముందు అశ్విన్, ఆండర్సన్ సంయుక్తంగా టాప్ ర్యాంకులో ఉండేవాళ్లు. అయితే, అశ్విన్ ఇటీవలి టెస్టుల్లో రాణించడంతో అదనంగా పాయింట్లు సాధించాడు.

ఇండియా నుంచి టాప్ టెన్‌లో సీనియర్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఏడో ర్యాంకులో, రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో కూడా టాప్‌లో అశ్వినే నిలవడం మరో విశేషం. అశ్విన్ టాప్ ప్లేసులో కొనసాగుతుండగా, రవీంద్ర జడేజా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్లలో అక్షర్ పటేల్ 4వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. టెస్టు ర్యాంకింగ్‌లో జట్లకు సంబంధించి భారత్ రెండో ర్యాంకులో నిలిచింది.