Ravichandran Ashwin 450 Test wickets: అశ్విన్ అదరహో.. అనిల్ కుంబ్లే రికార్డును దాటేశాడుగా!

Ravichandran Ashwin 450 Test wickets: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరహో అనిపించాడు. టెస్టుల్లో భారత తరఫున వేగంగా 450 వికెట్లు పడగొట్టిన రికార్డు సాధించాడు.

Ravichandran Ashwin 450 Test wickets: అశ్విన్ అదరహో.. అనిల్ కుంబ్లే రికార్డును దాటేశాడుగా!

Ravichandran Ashwin 450 Test wickets: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. 89వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో భారత తరఫున వేగంగా 450 వికెట్లు పడగొట్టిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాగపూర్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో అలెక్స్ కారీ వికెట్ పడగొట్టి ఈ రికార్డు సాధించాడు. 18 ఏళ్లుగా అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును తాజాగా అశ్విన్ సవరించాడు.

టెస్టుల్లో వేగంగా 450 వికెట్లు పడగొట్టిన రికార్డు శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. 80 మ్యాచ్ ల్లోనే అతడీ ఘనత సాధించాడు. అతడి తర్వాత అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున మాత్రం ఈ రికార్డు అశ్విన్ సాధించాడు. ఓవరాల్ గా 9 మంది బౌలర్లు 450 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), అనిల్ కుంబ్లే(భారత్), మెక్ గ్రాత్, షేన్ వార్న్, లయన్(ఆస్ట్రేలియా), ఆండర్సన్(ఇంగ్లండ్), వాల్ష్(వెస్టిండీస్), బ్రాడ్(ఇంగ్లండ్), అశ్విన్(భారత్) ఈ ఘనత సాధించారు.

36 ఏళ్ల అశ్విన్ అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాకు ప్రధాన బౌలర్, ఆల్ రౌండర్ గా ఉన్నాడు. ఇప్పటివరకు 113 వన్డేలు ఆడి 151 వికెట్లు పడగొట్టాడు. 65 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో 72 వికెట్లు దక్కించుకున్నాడు. బ్యాటింగ్ లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. 88 టెస్టుల్లో 5 సెంచరీలతో 3043 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 707 వన్డే పరుగులు ఉన్నాయి.

Also Read: భారత్ జట్టులో ఆంధ్రా కుర్రాడు.. టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్..