Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్ ఎవరంటే? టెస్ట్ జట్టు ఇదే!

భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్ ఎవరంటే? టెస్ట్ జట్టు ఇదే!

Rohit Sharma

Rohit Sharma: భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సొంతగడ్డపై త్వరలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌ నుంచి రోహిత్ ఫుల్‌టైమ్‌ టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్‌ సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశారు.

తర్వాతి పరిణామాల్లో టెస్ట్‌ కెప్టెన్సీ రేసులో రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రాల పేర్లు వినిపించినా చివరకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉండాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించడంతో టీమిండియాకు విరాట్ కోహ్లీ వారసుడు దొరికాడు. టెస్ట్ క్రికెట్ బాధ్యతను రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అంతకుముందు టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించిన తర్వాత రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉండనున్నట్లు వెల్లడించింది. వన్డేలు, టీ20ల కెప్టెన్సీ విషయానికి వస్తే, రోహిత్ శర్మ ఇప్పటికే చక్కగా సారథ్యం వహించాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకడు.

చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్‌లకు విశ్రాంతి ఇచ్చి టెస్ట్ జట్టును ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానెలకు టెస్టు జట్టులో చోటు ఇవ్వలేదు. వీరిద్దరూ ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు వారికి అనుమతి ఇచ్చామని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తెలిపారు.

శ్రీలంక సిరీస్ కోసం టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా (వైస్-కాప్టైన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్