IND vs SL : రోహిత్ కొట్టిన షాట్‌‌కు ప్రేక్షకుడి ముక్కు పగిలింది..

టాస్ గెలిచిన తర్వాత మయాంక్ అగర్వాల్ తో కలిసి రోహిత్ జట్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే అతను విఫలం చెందాడు. కానీ...ఆరో ఓవర్ విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని బాల్ ను రోహిత్ మిడ్...

IND vs SL : రోహిత్ కొట్టిన షాట్‌‌కు ప్రేక్షకుడి ముక్కు పగిలింది..

India

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన షాట్ కు బంతి తగిలి యువకుడి ముక్కు పగిలిపోయింది. దీంతో అతడికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతడి ఎముక ఫ్రాక్చర్ అయినట్లు, చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. భారత్ – శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ రాణించలేదు.

Read More : Virat Kohli: డివిలియర్స్ పేరు పిలిచిన అభిమానులు, విరాట్ వెనక్కు చూసి..

టాస్ గెలిచిన తర్వాత మయాంక్ అగర్వాల్ తో కలిసి రోహిత్ జట్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే అతను విఫలం చెందాడు. కానీ…ఆరో ఓవర్ విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని బాల్ ను రోహిత్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ బంతి అమాంతం ఆకాశంలో ఎగురుతూ.. స్టేడియంలో ఉన్న ఓ వ్యక్తి ముక్కుకు బలంగా తగిలింది. దీంతో అతని ముక్కు నుంచి రక్తం కాది. వెంటనే అక్కడున్న వారు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించగా ఎముక ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారించారు. అతడికి చికిత్స చేసిన అనంతరం ఆసుపత్రి డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం.

Read More : Rishabh Pant: కపిల్ దేవ్ 40ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్ పంత్

ఇక మ్యాచ్ విషయానికి వస్తే… రోహిత్ శర్మ కేవలం 15 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే చేసింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియాలో శ్రేయస్స అయ్యర్ (92) పోరాటం చేయడం విశేషం. దీంతో భారత జట్టు ఆ మాత్రమనా స్కోరు చేయగలిగింది. అంతేగాకుండా.. టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ 40 ఏళ్ల నాటి కపిల్ దేవ్ రికార్డు బ్రేక్ చేయడం విశేషం. ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆడిన పంత్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ను 109 పరుగులకే ముగించింది.