IND vs NZ: టీమిండియా బ్యాట్స్‌మన్‌గా స్పెషల్ ఫీట్ సాధించిన శ్రేయాస్ అయ్యర్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తొలి రోజు 75 పరుగులతో అజేయంగా నిలిచిన అయ్యర్.. రెండో రోజు ఆటలో శుక్రవారం తొలి సెషన్లో మూడు డిజిట్ల స్కోరును నమోదు చేశాడు. 92వ ఓవర్లో తొలి బంతికి...

IND vs NZ: టీమిండియా బ్యాట్స్‌మన్‌గా స్పెషల్ ఫీట్ సాధించిన శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer

IND vs NZ: టెస్ట్ ఫార్మాట్ అరంగేట్ర మ్యాచ్‌‌లోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తొలి రోజు 75 పరుగులతో అజేయంగా నిలిచిన అయ్యర్.. రెండో రోజు ఆటలో శుక్రవారం తొలి సెషన్లో మూడు డిజిట్ల స్కోరును నమోదు చేశాడు. జేమీసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 92వ ఓవర్లో తొలి బంతికి రెండు పరుగులు పూర్తి చేసిన శ్రేయస్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు.

157 బంతుల్లో 12 ఫోర్లతో ఈ ఘనత అందుకోవడం విశేషం. ముంబై తరపున రోహిత్‌, పృథ్వీల తర్వాత అరంగేట్రంలోనే సెంచరీ బాదేసిన బ్యాట్స్‌మన్‌ మూడో బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యరే. న్యూజిలాండ్‌పై అర్జన్‌ కృపాల్‌ సింగ్‌, (1955), సురిందర్‌ అమర్‌నాథ్‌ (1976)ల తర్వాత అరంగేట్ర టెస్టు సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్ అయ్యరే.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుపై పట్టు సాధించే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. రెండో రోజు ఆటలో భారత జట్టుకు ఏదీ కలిసి రాలేదు. ఓవర్‌నైట్‌ స్కోరు 258/4తో ఉదయం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌.. 400 పైచిలుకు స్కోరు సాధిస్తుందనుకుంటే టిమ్‌ సౌథీ (5/69) ధాటికి 345 పరుగులకే పరిమితమైంది.

………………………………………. : టీడీపీ లీడర్లకు చంద్రబాబు గట్టి వార్నింగ్

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌ ఆట ఆఖరుకు వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్‌ యంగ్‌ (75), టామ్‌ లాథమ్‌ (50) తమ జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు.