Sourav Ganguly: శుభమాన్ గిల్ పై గంగూలీ ప్రశంసలు.. ఆ ముగ్గురు భారత్ బలం..

Sourav Ganguly Praise Shubman Gill: శుభ్‌మాన్ గిల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని చూస్తున్నాను. గత ఆరు-ఏడు నెలలుగా గిల్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులో అతడు ఇప్పుడు శాశ్వత ఆటగాడు.

Sourav Ganguly: శుభమాన్ గిల్ పై గంగూలీ ప్రశంసలు.. ఆ ముగ్గురు భారత్ బలం..

Sourav Ganguly Praise Shubman Gill: ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో టీమిండియా ప్రదర్శనపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా యువ ఆటగాడు శుభమాన్ గిల్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. భారత జట్టులో అతడు పర్మినెంట్ ప్లేయర్ గా మారాడని వ్యాఖ్యానించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెల్చుకున్న సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ లో శుభమాన్ గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని గంగూలీ ప్రశంసించాడు.

“బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో ఆస్ట్రేలియాను ఓడించినందుకు టీమిండియాను అభినందిస్తున్నాను. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో భారత్ గెలిచింది. ఇంగ్లాండ్‌లోనూ విజయం సాధించింది కాబట్టి WTC ఫైనల్‌లో టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాగా బ్యాటింగ్ చేసి 350 నుంచి 400 స్కోర్ సాధిస్తే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. శుభ్‌మాన్ గిల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని చూస్తున్నాను. గత ఆరు-ఏడు నెలలుగా గిల్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులో అతడు ఇప్పుడు శాశ్వత ఆటగాడు” అని గంగూలీ పేర్కొన్నాడు.

Also Read: ఐపీఎల్ తో డబ్య్లూటీసీ విజయావకాశాలు దెబ్బతింటాయా.. ప్రిపరేషన్ పై రోహిత్ శర్మ ఏమన్నా

స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్ ను గంగూలీ ప్రశంసించాడు. వారు ముగ్గురు టీమిండియాకు బలమని వ్యాఖ్యానించాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమానంగా రాణించి జట్టుకు వెన్నుముఖగా నిలిచారని మెచ్చుకున్నాడు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లోనూ సత్తా చాటారని అన్నాడు.

Also Read: భయ్యా, నువ్వు కూడా బౌలింగ్ చేస్తే నేనేం చేయాలి..? పుజారాను ప్రశ్నించిన అశ్విన్

కాగా, వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ లో ఓవల్ లో జరగనుంది. WTC ఫైనల్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. గత సిరీస్ లో రన్నరప్ గా నిలిచిన భారత జట్టు ఈసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.