Pujara – Rahane: ‘వారిద్దరినీ పక్కకుపెట్టేస్తారని ముందే అనుకున్నా’

టీమిండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పూజారా, అజింకా రహానెలను శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పించింది బీసీసీఐ. దీనిపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్....

Pujara – Rahane: ‘వారిద్దరినీ పక్కకుపెట్టేస్తారని ముందే అనుకున్నా’

Gavaskar

Pujara – Rahane: టీమిండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పూజారా, అజింకా రహానెలను శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పించింది బీసీసీఐ. దీనిపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇలా జరుగుతుందని తాను ముందే అనుకున్నానని అంటున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పరిణామం ఇలా అవుతుందని అనుకున్నట్లు వెల్లడించారు.

శ్రీలంకతో జరిగే టెస్టు, టీ20 సిరీస్ లకు పూజారా, రహానెలను పక్కకుపెట్టేసింది సెలక్షన్ కమిటీ. కొన్నేళ్గుగా టెస్టు ఫార్మాట్ లో ఫామ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

‘ఊహించినట్లే జరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల్లో ఒక్క సెంచరీ అయినా.. లేదా ఇన్నింగ్స్ కు ఒక 80-90 పరుగులైనా చేసి ఉంటే విషయం వేరేలా ఉండేది. అజింకా రహానె బాగా ఆడినప్పటికీ చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయాడు’

Read Also : క్లీన్ స్వీప్ పై కన్నేసిన రోహిత్ సేన

‘రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో ప్రతి మ్యాచ్ కు 200-250 పరుగులు చేయగలిగితే మంచి ఫామ్ సంపాదించినట్లే. ఈ టెస్టు సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ లోనూ ఒక టెస్టు ఉంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్. నవంబర్, డిసెంబర్ లో మరో టెసుటు ఉంది. మరోసారి వారికి అవకాశం ఇవ్వడం కష్టమే అనిపిస్తుంది. ఫామ్ సాధించినప్పటికీ 30కి పైబడిన వయస్సులో సాధించే దాని కంటే యువ ఆటగాళ్లకు అవకాశమిస్తే కుదురుకునే ఛాన్సులు ఎక్కువ’ అని గవాస్కర్ అన్నారు.