Suryakumar Yadav Fans: కాస్తైనా సిగ్గుపడు.. బాబర్ ఆజంపై సూర్య భాయ్ ఫ్యాన్స్ ఫైర్

Suryakumar Yadav Fans: టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

Suryakumar Yadav Fans: కాస్తైనా సిగ్గుపడు.. బాబర్ ఆజంపై సూర్య భాయ్ ఫ్యాన్స్ ఫైర్

Suryakumar Yadav Fans: టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. స్కై షాట్లను కాపీ కొట్టడానికి సిగ్గు లేదా అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇంతకీ బాబర్ ఆజం చేశాడనేగా మీ డౌటు? ప్రాక్టీస్ లో సూర్యకుమార్ యాదవ్ షాట్లను మక్కీకి మక్కి దించేయడమే స్కై ఫాన్స్ ఫైర్ కి కారణం. అంతేకాదు ‘కొత్త మిస్టర్ 360’ అంటూ క్రికెట్ పాకిస్తాన్ కితాబివ్వడంతో స్కై అభిమానులకు మరింత కోపం తెచ్చిపెట్టింది.

సమకాలిన క్రికెట్ లో బాబర్ ఆజం, సూర్యకుమార్ యాదవ్ స్టార్ ఆటగాళ్లుగా వెలుగొందుతున్నారు. పాకిస్తాన్ టీమ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాబర్ ఆజం అన్ని ఫార్మాట్లలోనూ తనదైన శైలిలో పరుగులు సాధిస్తూ టాప్ బ్యాట్స్ మన్ గా పేరొందాడు. సూర్యకుమార్ తన దూకుడైన ఆటతీరుతో పొట్టి ఫార్మాట్ లో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా 360 కోణంలో అతడు ఆడే షాట్లకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అందుకే అతడిని ‘ద మోడ్రన్ డే మిస్టర్ 360’ అని ముద్దుగా పిలుస్తుంటారు.

తాజాగా, బాబర్ ఆజం ప్రాక్టీస్ వీడియోను క్రికెట్ పాక్తిస్తాన్ తన అధికారిక ట్విటర్ హేండిల్ లో షేర్ చేసింది. అక్కడితో ఆగకుండా ‘బాబర్ ఆజం ద న్యూ మిస్టర్ 360’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీనిపై స్కై అభిమానులు మండిపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ షాట్లను కాపీ కొడుతున్నందుకు కాస్తైనా సిగ్గుపడు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. సూర్య భాయ్ దెబ్బకు బాజర్ ఆజం కూడా 360 డిగ్రీల షాట్లను ప్రాక్టీస్ చేస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు.

కాగా, 2022లో సూర్యకుమార్ ICC T20I క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోగా, బాబర్ ఆజం ODIలలో అదే బహుమతిని అందుకున్నాడు. గతేడాది 31 టి20 మ్యాచ్ లు ఆడిన స్కై 46.56 సగటుతో 1164 పరుగులు చేశాడు. అంతేకాదు 3 నెలల వ్యవధిలో రెండు సెంచరీలతో 187.43 స్ట్రైక్-రేట్‌ను సాధించాడు. టి20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాటర్ గా నిలిచాడు.

Read Also : Hockey Player Paramjeet Kumar: రోజు కూలీగా మారిన హాకీ ప్లేయర్.. పిలిచి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన సీఎం