Satya Nadella: సత్యనాదెళ్ల పెట్టుబడిదారుడిగా ఐపీఎల్‌ స్టైల్‌లో అమెరికాలోనూ టీ20 లీగ్

క్రికెట్ ప్రపంచంలోకి అమెరికా కూడా అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చూరగొన్న ఈ జెంటిల్‌మ్యాన్ గేమ్ ఆదరణ కోసం అమెరికా నుంచి సైతం పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్‌లు కో ఫౌండర్ లుగా వారితో పాటు పలు దిగ్గజ కంపెనీల యజమానులు, సీఈఓలు సంయుక్తంగా మేజర్ లీగ్ క్రికెట్ ను ప్రారంభించారు.

Satya Nadella: సత్యనాదెళ్ల పెట్టుబడిదారుడిగా ఐపీఎల్‌ స్టైల్‌లో అమెరికాలోనూ టీ20 లీగ్

Satya Nadella

Satya Nadella: క్రికెట్ ప్రపంచంలోకి అమెరికా కూడా అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చూరగొన్న ఈ జెంటిల్‌మ్యాన్ గేమ్ ఆదరణ కోసం అమెరికా నుంచి సైతం పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్‌లు కో ఫౌండర్ లుగా వారితో పాటు పలు దిగ్గజ కంపెనీల యజమానులు, సీఈఓలు సంయుక్తంగా మేజర్ లీగ్ క్రికెట్ ను ప్రారంభించారు. ఇందులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాన పెట్టుబడిదారుడిగా ఉండటం విశేషం.

అమెరికాలో వరల్డ్‌ క్లాస్‌ టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ, ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ కోసం నిర్వాహకులు ఏ అండ్‌ ఏ1 ఫండ్‌ రైజింగ్‌ పేరుతో నిధుల్ని సమీకరించారు. ఇప్పటివరకు 44మిలియన్ డాలర్లను సేకరించగా..మరో 12నెలల్లో 76మిలియన్ డాలర్ల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంగా 120మిలియన్‌ (రూ.9,32,30,10,000) డాలర్లను ఫండ్‌ను సేకరించేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నారట.

సిరీస్ A, సిరీస్ A1 రౌండ్ ఫండ్ రైజింగ్ కు సత్య నాదెళ్ల నాయకత్వం వహించారు. “అమెరికాలో క్రికెట్ వ్యాప్తి కోసం, సదుపాయాల కల్పన కోసం ఫండ్ రైజింగ్ చేపట్టాం. దీని కోసం అత్యుత్తమ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కమిటీ పనిచేసింది. ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ క్రికెట్ ను అతిపెద్ద స్పోర్ట్స్ మార్కెట్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం”

Read Also: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పెట్టుబడులతో Groww

“ఇన్వెస్టర్ గ్రూపులో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలను నడిపించే వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. వారి మార్గదర్శకత్వంలోనే అమెరికాలో తొలి టీ20 లీగ్ ను విజయవంతం చేస్తాం. అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లను సైతం ఇక్కడ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాం” అని మేజర్ లీగ్ సహ వ్యవస్థాపకులు సమీర్ మెహతా శ్రీనివాసన్ వెల్లడించారు.

పెట్టుబడిదారుల్లో సత్య నాదెళ్లతో పాటుగా శంతను నాయణ్, మాడ్రోనా వెంచర్ గ్రూప్ ఎండీ సోమ సేగర్, మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్‌షిప్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రాజారమణ్, వెంకీ హరినారాయణ్, ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ ఛైర్మన్ జైతర్ సంజయ్ గోవిల్, మేనేజింగ్ పార్టన్ పెరోట్ జైన్ తదితరులు ఉన్నారు.