T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయం

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 దశలో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. అప్ఘానిస్తాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ 5 వికెట్ల..

T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయం

T20 World Cup 2021 Pakistan Beats Afghanistan

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 దశలో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. అప్ఘానిస్తాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. టార్గెట్ పెద్దది కాకపోయినా చేజ్ చేసేందుకు పాకిస్తాన్ శ్రమించాల్సి వచ్చింది. అప్ఘాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కానీ, పాకిస్తాన్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.

ఆ ఇష్టమే Puneeth Rajkumar ప్రాణం తీసిందా? మృతికి అసలు కారణం అదేనా?

పాక్ కెప్టెన్ బాబర అజమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ(51) చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఫకర్ జమాన్(30) పరుగులు చేశాడు. చివర్లో ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షం కురిపించాడు. నాలుగు సిక్సులు బాది పాకిస్తాన్ కు విజయాన్ని ఖాయం చేశాడు. అప్ఘానిస్తాన్ నిర్దేశించిన టార్గెట్ ను పాకిస్తాన్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. అప్ఘానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. ముజిబుర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచిన అప్ఘానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచుల్లో రాణించిన పాకిస్తాన్ బౌలర్లు మరోసారి అదరగొట్టారు. అప్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో అప్ఘానిస్తాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓ దశలో 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన అప్ఘాన్ జట్టుని కెప్టెన్ మహమ్మద్ నబీ(35*), నైబ్(35*) ఆదుకున్నాడు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో అప్ఘనిస్తాన్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. నజీబుల్లా జద్రాన్ (22) రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో ఇమద్ వసీమ్ 2 వికెట్లు తీశాడు. అఫ్రిదీ, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
ఎలాంటి అంచనాలు లేకుండా వరల్డ్ కప్ బరిలోకి దిగిన పాకిస్తాన్ అదరగొడుతోంది. పాకిస్తాన్ బౌలర్లు బంతితో నిప్పులు చెరుగుతున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కట్టిడి చేస్తున్నారు. తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రతర్థిపై సంచలన విజయంతో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ టోర్నీలో భారత్ పై పాకిస్తాన్ కు ఇదే తొలి విజయం. ఆ తర్వాత న్యూజిలాండ్ ను కూడా చిత్తు చేసింది పాకిస్తాన్. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో (గ్రూప్-2లో ) అగ్రస్థానంలో నిలిచింది.

స్కోర్లు..
అప్ఘానిస్తాన్ – 147/6
పాకిస్తాన్ – 148/5(19 ఓవర్లు)