Gautam Gambhir: వాళ్లు మన క్రికెట్‌ను నాశనం చేస్తారు: గౌతం గంభీర్

గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘మన జట్టుకు విదేశీ కోచ్ లు అవసరం లేదు. మన జట్టును, క్రికెట్ ను వాళ్లు నాశనం చేస్తారు. భారతీయ కోచ్ లలో ఏ లోపం ఉంది. వాళ్లు చేసిన తప్పు ఏమిటి? మన దేశ కోచ్ లాల్ చంద్ రాజ్ పుత్ కోచ్ గా ఉన్న సమయంలోనే మన జట్టు ఐసీసీ టీ20-2007 ప్రపంచ కప్ గెలిచింది’’ అని చెప్పారు.

Gautam Gambhir: వాళ్లు మన క్రికెట్‌ను నాశనం చేస్తారు: గౌతం గంభీర్

Gautam Gambhir

Gautam Gambhir: టీమిండియాకు విదేశీ కోచ్ ల అంశంపై భారత్ మాజీ ఆటగాడు, ఎంపీ గౌతం గంభీర్ విమర్శలు గుప్పించారు. వాళ్లు మన క్రికెట్‌ను నాశనం చేస్తారని చెప్పారు. టీమిండియాకు విదేశీ కోచ్ లను నియమించడం సరికాదని అన్నారు. టీమిండియాకు మన దేశ కోచ్ లే అన్ని రకాలుగా సరిపోతారని చెప్పారు.

తాజాగా గౌతం గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘మన జట్టుకు విదేశీ కోచ్ లు అవసరం లేదు. మన జట్టును, క్రికెట్ ను వాళ్లు నాశనం చేస్తారు. భారతీయ కోచ్ లలో ఏ లోపం ఉంది. వాళ్లు చేసిన తప్పు ఏమిటి? మన దేశ కోచ్ లాల్ చంద్ రాజ్ పుత్ కోచ్ గా ఉన్న సమయంలోనే మన జట్టు ఐసీసీ 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచింది’’ అని చెప్పారు.

గతంలో భారత్-ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన ట్రై-సిరీస్ లో టీమిండియా గెలిచిందని, ఆ సమయంలోనూ లాల్ చంద్ రాజ్ పుత్ కోచ్ గా ఉన్నారని చెప్పారు. అయిత, ఆ విషయాలన్నింటినీ వదిలేసి 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన సమయంలో విదేశీ కోచ్ గ్యారీ క్రిస్టెన్ భారత జట్టుకు కోచ్ గా ఉన్నారన్న విషయాన్ని మాత్రమే గుర్తుంచుకుంటున్నామని చెప్పారు. కాగా, టీమిండియాకు ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉన్నారు. ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో తాత్కాలిక కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..