IPL 2022: “నాకు ఇండియాలో శాపం తగిలిందనుకుంటున్నా”
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ అంతగా కలిసిరాలేదని చెప్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాతినిధ్యం వహించగా.. ప్లే-ఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. 8మ్యాచ్‌లలో 251 పరుగులు చేయడంతో పాటు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.

Ipl 2022
IPL 2022: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ అంతగా కలిసిరాలేదని చెప్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాతినిధ్యం వహించగా.. ప్లే-ఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. 8మ్యాచ్‌లలో 251 పరుగులు చేయడంతో పాటు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. కాకపోతే గాయాల బెడద ఎక్కువగా బాధపెట్టింది. చివరి మ్యాచ్ ఆడిన తర్వాత కొవిడ్-19 బారినపడ్డాడు.
రికవరీ తర్వాత 30ఏళ్ల ప్లేయర్ బ్యాట్, బాల్ తో బాగానే రాణించాడు. అయితే రీసెంట్ గా గాయాలపాలైన మార్ష్.. తనకు ఇండియాలో టోర్నమెంట్ ఒక శాపంలా మారిందని అంటున్నాడు.
“స్టార్ట్ అయిన రెండు వారాలకే ఇండియా నాకేదో శాపంలా ఫీలయ్యా. మొదటి గాయం చాలా చిన్నదైనా.. ఒక గేమ్ తర్వాత కొవిడ్ వచ్చి ఇబ్బంది పెట్టింది. నా తర్వాత బోర్డ్‌పై స్థిరమైన ప్రదర్శనలు ఉంచడం సంతోషంగా ఉంది” అని చెప్పిన మిచెల్.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్‌లో ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ గురించి కూడా అద్భుతంగా ప్రశంసలు గుప్పించాడు.
Read Also: ఐపీఎల్ ఫైనల్ వేడుకలో అతిపెద్ద జెర్సీ లాంచ్
“ప్రతి ఒక్కరూ అతని గురించి, సాధించిన తీరు, ఆటగాళ్లను ఎంతగా పట్టించుకుంటాడో నిజంగా అర్థమైంది – అతను కెప్టెన్‌గా, జట్టు నాయకుడిగా అదే విధంగా ఉంటాడని భావిస్తున్నా, మీకు అనుభూతిని కలిగించే విధంగా – ఢిల్లీకి ముఖ్యమైన ఆటగాడిగా అనిపించేలా చేశాడు. నాయకుడు మీలో అలాంటి నమ్మకాన్ని కలిగించినప్పుడు దాని నుండి విశ్వాసం పొందుతారు” అని మార్ష్ పేర్కొన్నాడు.
IPL 2022 పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్ దశకు చేరుకోకముందే నిష్క్రమించింది.