UPW vs MI WPL 2023 : తిరుగులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం, చెలరేగిన కౌర్

ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.

UPW vs MI WPL 2023 : తిరుగులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం, చెలరేగిన కౌర్

UPW vs MI WPL 2023 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో(WPL) ముంబై ఇండియన్స్ జైత్ర యాత్ర కంటిన్యూ అవుతోంది. ఆ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఆదివారం యూపీ వారియర్స్ తో తలపడిన ముంబై.. మరోసారి అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.

మరో 15 బంతులు మిగిలి ఉండగానే.. టార్గెట్ ను ఫినిష్ చేసింది. ముంబై జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 33 బంతుల్లోనే 53 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఆమె స్కోర్ లో 9 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. నాట్ స్కీవర్(45), యశ్తిక భాటియా(42) రాణించారు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. యూపీ జట్టులో అలీసా హీలీ, తహిళ మెక్ గ్రాత్ హాఫ్ సెంచరీతో రాణించారు. హీలీ 46 బంతుల్లో 58 పరుగులు చేసింది. మెక్ గ్రాత్ 37 బంతుల్లో 50 పరుగులు చేసింది.

ఈ టోర్నీలో ముంబై విజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. ఆ జట్టుకి ఇది వరుసగా నాలుగో విజయం. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ముంబై గెలిచింది. 8 పాయింట్లతో టేబుల్ లో టాప్ పొజిషన్ లో ఉంది. గుజరాత్, బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్ ను చిత్తు చేసిన ముంబై.. ఇప్పుడు యూపీ వారియర్స్ పైనా ఆధిపత్యం కనబర్చింది.

స్కోర్లు..
యూపీ వారియర్స్-20 ఓవర్లలో 159/6
ముంబై ఇండియన్స్-17.3 ఓవర్లలో 164/2