IND VS AUS: అరుదైన రికార్డులకు చేరువలో కోహ్లీ, అశ్విన్.. నాలుగో టెస్టులో సాధ్యమయ్యేనా?

గుజరాత్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. గురువారం ఉదయం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కూడా హాజరయ్యారు.

IND VS AUS: అరుదైన రికార్డులకు చేరువలో కోహ్లీ, అశ్విన్.. నాలుగో టెస్టులో సాధ్యమయ్యేనా?

IND VS AUS: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ ఇద్దరూ కొత్త రికార్డులు సాధించే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా.

India-Pak: పాక్ రెచ్చగొడితే భారత్ సైనిక చర్యకు దిగుతుంది.. అమెరికా వర్గాల అంచనా

గుజరాత్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. గురువారం ఉదయం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కూడా హాజరయ్యారు. ఇక ఇప్పటికే అనేక రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. కోహ్లీ ఈ టెస్టులో మరో 42 పరుగులు సాధిస్తే, ఇండియాలో టెస్టుల్లో 4,000 పరుగుల మైలురాయిని దాటిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఇండియాలో టెస్టుల్లో 4,000 పరుగులు పూర్తి చేసుకున్నారు.

India In UN: ముందు మీ దేశాన్ని బాగు చేసుకోండి.. పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇప్పుడు 42 పరుగులు సాధిస్తే, కోహ్లీ కూడా వీరి సరసన చేరుతాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి కోహ్లీ కచ్చితంగా ఈ ఘనత సాధించే అవకాశాలున్నాయి. స్పిన్ బౌలర్ అశ్విన్ ఏకంగా రెండు రికార్డులకు దగ్గరలో ఉన్నాడు. మరో 10 వికెట్లు సాధిస్తే అంతర్జాతీయ కెరీర్లో 700 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే తమ అంతర్జాతీయ కెరీర్లో 700 వికెట్లు తీశారు. 36 ఏళ్ల అశ్విన్ టెస్టుల్లో 467 వికెట్లు తీయగా, వన్డేల్లో 151 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్లలోనూ అశ్విన్ అద్భుతంగా రాణించాడు. అశ్విన్‌ను ఊరిస్తున్న రికార్డు మరోటి ఉంది.

ఈ టెస్టు మ్యాచులో మరో నాలుగు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తారు. ఇంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరు మీద ఉంది. అనిల్ కుంబ్లే ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యధికంగా 111 వికెట్లు తీశారు. అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే, ఈ రికార్డు సమం చేసి కుంబ్లే సరసన నిలుస్తాడు. ఐదు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు.