Virat Kohli: విరాట్ ను కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బలవంతపెట్టారు – షోయబ్ అక్తర్

పాకిస్తాన్ మాజీ క్రికెట్ షోయబ్ అక్తర్ టీమిండియా కెప్టెన్సీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ ను కెప్టెన్సీ నుంచి దిగిపోవాలంటూ బలవంతపెట్టారని కామెంట్ చేశారు.

Virat Kohli: విరాట్ ను కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బలవంతపెట్టారు – షోయబ్ అక్తర్

Virat Kohli

Virat Kohli: పాకిస్తాన్ మాజీ క్రికెట్ షోయబ్ అక్తర్ టీమిండియా కెప్టెన్సీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ ను కెప్టెన్సీ నుంచి దిగిపోవాలంటూ బలవంతపెట్టారని కామెంట్ చేశారు. గతేడాది వన్డే కెప్టెన్ గా తప్పుకున్న కోహ్లీ.. ఆ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి, రీసెంట్ గా ఏడేళ్ల పాటు కెప్టెన్సీ వహించిన టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

దీనిపై మాట్లాడిన అక్తర్.. ‘విరాట్ కెప్టెన్సీ వదిలేవాడు కాదు. బలవంతంగా అలా చేశారు. అతను సత్తా కలవాడని చాలా సార్లు నిరూపించుకున్నాడు. అతనొక గొప్ప వ్యక్తి, క్రికెటర్ కూడా. అన్ని విషయాలు చేయాలని లేదు. వెళ్లి క్రికెట్ ఆడాలి అంతే కదా. ఒక బ్యాట్స్‌మన్ గా ప్రపంచంలో ఇతరులు సాధించలేనన్ని దక్కించుకున్నాడు. సహజమైన ఆటతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి’

‘విరాట్‌ది కుడిచేతి వాటం  ఫామ్ లేనప్పుడు ఈ కుడిచేతి బ్యాట్స్ మన్ చాలా సమస్యల్లో పడిపోతారు. దాని నుంచి త్వరగా బయటపడతాడని అనుకుంటున్నా. ఎవరిమీద ద్వేషం చూపించకుండా అందరినీ క్షమించేసి ముందుకెళ్తాడని ఆశిస్తున్నా’

ఇది కూడా చదవండి : స్విట్జర్లాండ్‌లో సమంత స్కైయింగ్..

టెస్టు కెప్టెన్సీ అప్పగించడంలో బీసీసీఐ స్మార్ట్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. అని పేర్కొన్నాడు రావల్పిండి ఎక్స్ ప్రెస్.

గత శుక్రవారమే టీ20 వరల్డ్ కప్ 2022 కు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది ఐసీసీ. అక్టోబర్ 23న ఆస్ట్రేలియాలోని మెల్‌బౌర్న్ క్రికెట్ వేదికగా మరోసారి మెగా టోర్నీ తొలి మ్యాచ్ ను పాకిస్తాన్ జట్టుతో ఆడనుంది టీమిండియా.