Doodle : గూగుల్ డూడుల్‌తో ఒలింపిక్ గేమ్స్ ఆడ‌తారా?

గూగుల్ కూడా యూజర్లకు ఓ భిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. ఇంట్లోనే కూర్చొని ఒలింపిక్స్ గేమ్స్ ఆడేయొచ్చని వెల్లడిస్తోంది. అందులో భాగంగా..చాంపియన్ ఐలాండ్ గేమ్స్ గా పిలుస్తున్న వీటిని చాలా క్రియేటివ్ గా రూపొందించడం విశేషం.

Doodle : గూగుల్ డూడుల్‌తో ఒలింపిక్ గేమ్స్ ఆడ‌తారా?

Google

Doodle Champion Island Games! : మెగా క్రీడా సంబరాలు మొదలయ్యాయి. టోక్యోలో కరోనా నేపథ్యంలో అత్యంత జాగ్రత్తల నడుమ ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. గూగుల్ కూడా యూజర్లకు ఓ భిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. ఇంట్లోనే కూర్చొని ఒలింపిక్స్ గేమ్స్ ఆడేయొచ్చని వెల్లడిస్తోంది. అందులో భాగంగా..చాంపియన్ ఐలాండ్ గేమ్స్ గా పిలుస్తున్న వీటిని చాలా క్రియేటివ్ గా రూపొందించడం విశేషం. రెండు వారాల పాటు ఏడు మినీ గేమ్స్ ఉండనున్నాయి. జపాన్ కు చెందిన Studio 4°C కంపెనీ క్రియేట్ చేసింది.

Read More : RRR: ప్రమోషన్ పాటలో ప్రభాస్, రానా, అనుష్క.. నిజమేంటంటే?

ఇందులో నాలుగు టీమ్స్ ఉంటాయి. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. వీటిలో ఒక టీమ్ ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మన స్కోరును ఇవ్వొచ్చు. ఈ స్కోర్లను గూగుల్ ట్రాక్ చేస్తుంది. టేబుల్ టెన్నిస్‌, క్లైంబింగ్, స్కేట్‌బోర్డింగ్‌, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్‌, ర‌గ్బీ, మార‌థాన్ ర‌న్నింగ్ ఈవెంట్‌ల‌లో కాలికో నింజా క్యాట్ ల‌క్కీ పాల్గొంటుంది. ఇప్పటికే ఈ డూడుల్స్ గేమ్స్ ప్రారంభం కాగా..టీమ్ రెడ్ లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు టీమ్స్ గేమ్స్ కు జపాన్ చరిత్ర, జానపద కథల పాత్రలు లెజెండరీ చాంపియన్ గా ఉంటాయి. ఆ పాత్రలను ఇందులోని ఒక్కో గేమ్ కు అనుసంధానించామని స్టూడియో వెల్లడిస్తోంది.