Dinesh Karthik: చెప్తున్నానంతే.. అంటూ టీమిండియాకు ఆఫర్ ఇచ్చిన డీకే

టీమిండియాకు చెప్పకనే చెప్పి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆఫర్ ఇస్తున్నాడు దినేశ్ కార్తీక్. తొమ్మిది రోజులుగా క్వారంటైన్ లో ఉంటూ కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు రిషబ్ పంత్.

Dinesh Karthik: చెప్తున్నానంతే.. అంటూ టీమిండియాకు ఆఫర్ ఇచ్చిన డీకే

Team India

Dinesh Karthik: టీమిండియాకు చెప్పకనే చెప్పి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆఫర్ ఇస్తున్నాడు దినేశ్ కార్తీక్. తొమ్మిది రోజులుగా క్వారంటైన్ లో ఉంటూ కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు రిషబ్ పంత్. అతనితో పాటు మరో కీపర్ వృద్ధిమాన్ సాహా సైతం ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి. సపోర్ట్ స్టాఫ్ మెంబర్ దయానంద్ గరానీకి పాజిటివ్ రావడంతో సాహా సైతం ఐసోలేషన్ కు వెళ్లిపోాడు.

దీంతో వికెట్ కీపర్ పొజిషన్ ప్రశ్నార్థకంగా మారింది. మూడు రోజుల ప్రాక్టీస్ టెస్టులో భాగంగా జట్టులో కీపర్ కరువవడంతో తాను ఉన్నానంటూ దినేశ్ కార్తీక్ ట్వీట్ ద్వారా హింట్ ఇస్తున్నారు. హాలీడే పీరియడ్ లో ఇంగ్లాండ్ లో ఉన్న టీమిండియా ప్లేయర్లకు పలువురికి వైరస్ సోకిందని పంత్, గరానీల పేర్లను మాత్రమే కన్ఫామ్ చేశారు.

వారితో కాంటాక్ట్ అయిన మిగిలిన వారిని ఐసోలేషన్ లో ఉంచారు. లండన్ లోని అతని స్నేహితుల వద్ద పంత్ ఉన్నాడనిఅధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కీపింగ్ కు తాను సిద్ధంగా ఉన్నానంటూ కార్తీక్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టాడు. కిట్ బ్యాగ్ ఉన్న ఫొటోతో.. చెప్తున్నానంతే అని పోస్టు పెట్టాడు.

ప్రస్తుతం కార్తీక్ ఇంగ్లాండ్ లో ఓ కామెంటేటర్ లా వ్యవహరించేందుకు వెళ్లాడు. ఈ వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించాడు.

బీసీసీఐ.. వికెట్ కీపర్ సాహా, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, రిజర్వ్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ మరో పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటారంటూ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడంతో కీపర్ స్థానం ప్రశ్నార్థకమైంది. జులై 20న మొదలుకానున్న ప్రాక్టీస్ టెస్టుకు కేఎల్ రాహుల్ ఒక్కడే ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.