WPL 2023 GG vs DC : వామ్మో ఇదేం కొట్టుడు.. 28బంతుల్లోనే 76 రన్స్. 10ఫోర్లు, 5సిక్సులు.. లేడీ సెహ్వాగ్ ఊచకోత

లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన షఫాలీ.. మొత్తం 28 బంతుల్లో 76 పరుగులు చేసింది. బౌండరీల వరద పారించింది. ఆమె స్కోర్ లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షఫాలీ దెబ్బతో ఢిల్లీ కేవలం 7.1 ఓవర్లలోనే 106 పరుగుల టార్గెట్ ను వికెట్లేమీ కోల్పోకుండా ఈజీగా చేజ్ చేసింది.

WPL 2023 GG vs DC : వామ్మో ఇదేం కొట్టుడు.. 28బంతుల్లోనే 76 రన్స్. 10ఫోర్లు, 5సిక్సులు.. లేడీ సెహ్వాగ్ ఊచకోత

WPL 2023 GG vs DC : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా శనివారం గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. గుజరాత్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో లేడీ సెహ్వాగ్ గా గుర్తింపు పొందిన ఢిల్లీ ఓపెనర్ షఫాలీ వర్మ.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన షఫాలీ.. మొత్తం 28 బంతుల్లో 76 పరుగులు చేసింది. బౌండరీల వరద పారించింది. ఆమె స్కోర్ లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షఫాలీ దెబ్బతో ఢిల్లీ కేవలం 7.1 ఓవర్లలోనే 106 పరుగుల టార్గెట్ ను వికెట్లేమీ కోల్పోకుండా ఈజీగా చేజ్ చేసింది.

Also Read..Jason Roy In PSL: వామ్మో ఇదేం బాదుడు.. 20 ఫోర్లు, 5 సిక్సర్లు.. దెబ్బకు రికార్డు బద్దలు

ముఖ్యంగా షెఫాలీ వర్మ సుడిగాలిలా విజృంభించింది. 106 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. షెఫాలీ వర్మ సూపర్ బ్యాటింగ్ తో కేవలం 7.1 ఓవర్లలోనే గెలుపు తీరాలకు చేరింది. షెఫాలీ స్కోర్ లో 10 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయంటే, ఆమె గుజరాత్ బౌలర్లను ఏ విధంగా ఊచకోత కోసిందో అర్థమవుతుంది.

మరో ఎండ్ లో కెప్టెన్ మెగ్ లానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్) కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అందుకు కారణం కూడా షెఫాలీనే. బుల్లెట్ షాట్లతో చెలరేగిన షెఫాలీ మ్యాచ్ ను సునామీ వేగంతో ముగించింది. డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.

Also Read..IND vs AUS Test 2023: తెలుగు కుర్రాడు భరత్‌కు రాహుల్ మద్దతు.. నాల్గో టెస్టులో చోటు పదిలమేనా..

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ మీడియం పేసర్ మరిజానే కాప్ అద్భుతమైన బౌలింగ్ తో గుజరాత్ జెయింట్స్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చింది. కాప్ ధాటికి గుజరాత్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. కాప్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది.

గుజరాత్ ఇన్నింగ్స్ లో కిమ్ గార్త్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఆఖర్లో కిమ్ సాధించిన పరుగుల వల్లే గుజరాత్ స్కోరు 100 మార్కు దాటింది. జార్జియా వేర్ హామ్ 22, హర్లీన్ డియోల్ 20 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే 3, రాధా యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.