Home » 2024 Elections
సమావేశానికి హాజరయ్యే సభ్యుల జాబితాలో కపిల్ సిబాల్ పేరు లేదు. అయితే సమావేశానికి ముందు ఫోటో సెషన్ సమయంలో ఆయన కనిపించారు. అయితే ఆగ్రహానికి గురైన కేసీ వేణుగోపాల్ ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా ఒప్పించేందుకు ప్రయత్నించారు.
వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తక్షణమే చర్చలు ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని, వివిధ ప్రాంతాల్లో జూడేగా భారత్, జీతేగా ఇండియా అంటూ నినాదాలు చేస్తామని చెప్పారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఇండియా కూటమి తీర్మానించింది. వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నేతల మధ్య అభిప్రాయం కుదిరింది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభం కానున్నట్లు ఇండియా కూటమి పేర్కొంది.
ముంబైలో సాగుతోన్న విపక్షాల సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు
రెండవ సమావేశాల సందర్భంగా బెంగళూరులో కూడా అన్ని పార్టీల నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలిసినవే. బిహార్ లో గంగా నదిపై నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జీ కూలిపోయిన విషయం తెలిసిందేగా.
విపక్షాల రెండు సమావేశాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. విపక్షాల ఐక్యత బీజేపీకి నష్టాన్ని చేకూర్చొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులు, విశ్లేషణలు ఎలా ఉన్నా.. గత ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడి
మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వస్తోంది.
ఇండియా మూడవ మీటింగుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి
ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘వారు(బీజేపీ) కార్ణాటకలో బజరంగ్ బలీని ముందుకు తీసుకువచ్చారు. అయితే ఆశీర్వాదం వారికి దక్కలేదు. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఎవరు గెలుస్తారని’’ అని అన్నారు.
విపక్షాల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహించనుంది. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేనే ఇండియా కూటమికి సమన్వయకర్త(కన్వినర్)గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.