2024 Elections: ఇండియా కూటమిలోని టాప్ 15 పార్టీల మొత్తం ఓట్లు కలిపినా బీజేపీ కంటే తక్కువే.. ఆసక్తికరంగా నంబర్ గేమ్

విపక్షాల రెండు సమావేశాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. విపక్షాల ఐక్యత బీజేపీకి నష్టాన్ని చేకూర్చొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులు, విశ్లేషణలు ఎలా ఉన్నా.. గత ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి.

2024 Elections: ఇండియా కూటమిలోని టాప్ 15 పార్టీల మొత్తం ఓట్లు కలిపినా బీజేపీ కంటే తక్కువే.. ఆసక్తికరంగా నంబర్ గేమ్

2019 Elections: దేశంలోని ప్రధాని విపక్ష పార్టీలన్నీ దాదాపుగా ఏకమయ్యాయి. అన్నీ కలిసి ఇండియా అనే పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి దింపడమే లక్ష్యమని వారంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు విపక్ష పార్టీలన్నీ సమావేశమయ్యాయి. ఈ రెండు సమావేశాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. విపక్షాల ఐక్యత బీజేపీకి నష్టాన్ని చేకూర్చొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులు, విశ్లేషణలు ఎలా ఉన్నా.. గత ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి.

Parliament Special Sessions: ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్రం.. ఇంత హడావుడిగా ఎందుకంటే?

ఇండియా కూటమిలోని టాప్ 15 పార్టీల మొత్తం ఓట్లు కలిపినా ఒక్క బీజేపీకి వచ్చన ఓట్లకంటే కూడా తక్కువగానే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 37.36 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, విపక్ష కూటమిలోని టాప్ 15 పార్టీల ఓట్లు కేవలం 37.27 శాతమే. మరో 11 పార్టీలు విపక్షాల కూటమిలో ఉన్నప్పటికీ ఎన్డీయే కూటమితో పోల్చినప్పుడు ఇండియా కూటమి చాలా వెనుకబడి ఉందనే చెప్పొచ్చు. గత ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇండియా కూటమిలోని టాప్ 15 పార్టీలు.. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన, సీపీఎం, జేడీయూ, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐ, ఆప్, జేఎంఎం, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఆర్ఎల్డీ, పీఎంకే.

George Soros: ఎవరీ జార్జ్ సోరోస్.. అదానీ గ్రూపుతో ఈయనకు ఉన్న లింకేంటి? మధ్యలో ప్రధాని మోదీ ఎందుకు వచ్చారు?

ఇక సీట్ల విషయంలో అయితే ఇండియా కూటమి మరింత వెనుకబడి ఉంది. ఇండియా కూటమిలో ప్రస్తుతం ఉన్న మొత్తం పార్టీలు కలిసి గత ఎన్నికల్లో 145+ స్థానాలు మాత్రమే గెలుచుకున్నారు. అదే సమయంలో ఒక్క బీజేపీనే 303 స్థానాలు గెలుచుకుంది. అయితే విపక్షాల ఐక్యత వల్ల సీట్లు పెరగొచ్చనే వాదన ఒక వస్తున్నప్పటికీ.. గతంలో ఒక్క జేడీయూ మినహా మిగిలిన పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పుడు వారంతా కలవడం వల్ల కలిసే ఓట్లు సీట్లను ప్రభావితం చేసేలా అయితే కనిపించడం లేదు. అయితే విపక్షాల ఐక్యత వల్ల ఓటర్లను ఇటు వైపు మళ్లితే ఫలితాలు మారే అవకాశం లేకపోలేదు.