Home » Agnipath
ఆంధ్ర ప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
రెండు పార్శిల్ వ్యాన్లు సహా మూడు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. 77 బోగీల అద్దాలు, ఎనిమిది లోకోమోటివ్ అద్దాలు పగిలిపోయాయి. 20 ద్విచక్ర వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఇవన్నీ కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.
అగ్నిపథ్ కింద రిక్రూట్ చేసుకున్న ‘అగ్నివీర్’లకు కేంద్ర పోలీసు బలగాల్లో 10% రిజర్వేషన్స్ అంటూ కేంద్ర హోమ్ శాఖ కీలక ప్రకటన చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తూనే ఉంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.
అకాడమీల్లోనే కొందరు నిరసనకారులకు నిర్వాహకులు ఆశ్రయం ఇచ్చారు. విద్యార్థులకు ఆర్మీ కోచింగ్ అకాడమీ నిర్వాహకులు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు సప్లై చేశారు. నర్సారావు పేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారా�
రాకేష్ మృతదేహాన్ని భద్రపరిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి యువత, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు ఆందోళన చేపట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడిన తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. అగ్నిపథ్ విషయంలో యువతను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన
అగ్నిపథ్ పథకంలో నియామకాలకు తొలి అడుగు పడింది. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు.
అగ్నిపథ్ పథకం ఒకరికి వ్యతిరేకం కాదు.. మరొకరికి అనుకూలం కాదు.. ఈ ఫథకంలో చేరాలన్న బలవంతం ఏమీలేదు.. స్వచ్ఛందంగా ఇష్టపడినవాళ్లే ఈ పథకంలో చేరొచ్చు. కాలపరిమితి పూర్తయిన తరువాత మళ్లీ బయటకు వచ్చి మీకు ఇష్టమొచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు.. అంటూ కేంద్ర మంత�
ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. మృతుడు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని దామోదర రాకేష్ (18)గా గుర్తించారు.