Agnipath: సికింద్రాబాద్ ఘటన వెనుక కుట్ర కోణం.. పోలీసుల అనుమానం

అకాడమీల్లోనే కొందరు నిరసనకారులకు నిర్వాహకులు ఆశ్రయం ఇచ్చారు. విద్యార్థులకు ఆర్మీ కోచింగ్ అకాడమీ నిర్వాహకులు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు సప్లై చేశారు. నర్సారావు పేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అభ్యర్థును రెచ్చగొట్టారు.

Agnipath: సికింద్రాబాద్ ఘటన వెనుక కుట్ర కోణం.. పోలీసుల అనుమానం

Agnipath (3)

Agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. పక్కా ప్రణాళికతోనే ఈ విధ్వంసం జరిగిందని పోలీసులు అంటున్నారు. పోలీసుల అంచనా ప్రకారం.. ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. అకాడమీల్లోనే కొందరు నిరసనకారులకు నిర్వాహకులు ఆశ్రయం ఇచ్చారు. విద్యార్థులకు ఆర్మీ కోచింగ్ అకాడమీ నిర్వాహకులు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు సప్లై చేశారు. నర్సారావు పేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అభ్యర్థును రెచ్చగొట్టారు.

IIIT BASARA: బాసర ట్రిపుల్ ఐటీలో ఐదో రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన

సుబ్బారావు ఆధ్వర్యంలో అభ్యర్థులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆర్మీ పరీక్ష క్యాన్సిల్ అయిందంటూ ఆవుల సుబ్బారావు మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో వీడియోలు పెట్టి విద్యార్థులను రెచ్చగొట్టారు. మొత్తంగా ఈ ఆందోళనల్లో పది అకాడమీలకు చెందిన అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.