Home » Congress
‘‘జగన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజు కొట్లాడారు.. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? అని అన్నారు.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమమైనా చేశారా?’ అని షర్మిల నిలదీశారు.
తమ వాహనాలను రామవరప్పాడు మీదుగా వదిలేంత వరకు వెళ్లబోమంటూ రోడ్డుపైన బైఠాయించారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు.
పబ్లిక్ రిలేషన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు స్వీకరిస్తారు.
ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి బెదిరింపు కాల్ చేసిన ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ అదానీ పెట్టుబడులను తిరస్కరిస్తే రేవంత్ తన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆహ్వానించారని ధ్వజమెత్తారాయన. ఓ ఫ్రాడ్ కంపెనీ, నష్టాల్లో ఉన్న కంపెనీతో వేల కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయడం అసాధ్యమని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని అన్నారు.
వేదికపై రేవంత్ రెడ్డి మాట్లాడాక ఓ యువతి ఆయనకు బోకేను అందించింది. దాన్ని రేవంత్ రెడ్డి తీసుకోవడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయిపోయింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగానే పార్టీకి తీవ్రంగా నష్టం జరిగిందన్న కార్యకర్తల అభిప్రాయాలతో అధిష్టానం ఏకీభవించింది.
పదవీ విరమణ చేసిన అధికారులకు జీతభత్యాల రూపంలో నెలకు 150 కోట్ల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, ఏడాదికి 1,800 కోట్లు చెల్లిస్తూ వస్తోంది.