సివిల్ సప్లయ్ అప్పులు రూ.58వేల కోట్లు- గత ప్రభుత్వంపై మంత్రుల సంచలన ఆరోపణలు

గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు.

సివిల్ సప్లయ్ అప్పులు రూ.58వేల కోట్లు- గత ప్రభుత్వంపై మంత్రుల సంచలన ఆరోపణలు

Bhatti Vikramarka Mallu Slams KCR On Debts

Updated On : January 20, 2024 / 9:59 PM IST

Bhatti Vikramarka Mallu : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గత కేసీఆర్ సర్కార్ సివిల్ సప్లయ్ ను నిర్లక్ష్యం చేసిందన్నారు. 2014లో 3వేల 700 కోట్లు ఎరియర్స్ ఉండగా.. ఇప్పుడు 14వేల 354 కోట్లకు చేర్చిందన్నారు. సర్కార్ సహకారం లేకపోవడంతో సివిల్ సప్లై పై భారం పడిందన్నారు. ధాన్యం కొనుగోలు నిధులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో భారం పడిందని వివరించారు.

ప్రస్తుతం సివిల్ సప్లై అప్పులు రూ.58వేల 860 కోట్లు అని వెల్లడించారు. గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేసిందన్నారు. నాటి సర్కార్ తీరుతో సివిల్ సప్లైపై భారం తడిసి మోపెడు అయ్యిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు. ఎంత కష్టమైనా.. విద్యార్థులకు సన్నబియ్యం, రేషన్ బియ్యం, రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

సివిల్ సప్లయ్ శాఖపై మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత కేసీఆర్ సర్కార్ పై మంత్రుల నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం నాశనమైందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల సివిల్ సప్లయ్ కార్పొరేషన్ పై రూ.58వేల 860 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం సివిల్ సప్లయ్ శాఖను నిర్వీర్యం చేసిందన్నారు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు సివిల్ సప్లయ్ శాఖ అప్పులు రూ.3వేల కోట్లుగా ఉందన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.58వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్.

Also Read : ఫార్ములా-ఈ రేసింగ్ గోల్‌మాల్‌పై రేవంత్‌రెడ్డి సర్కారు సీరియస్

ప్రతి ఏటా 3వేల కోట్లు వడ్డీ చెల్లింపు- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
”నిరుపేదల బియ్యం ఇచ్చే సివిల్ సప్లయ్ ని ఆర్థికంగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సివిల్ సప్లయ్ పై ప్రతి ఏడాది 3వేల కోట్లు ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. 15 వేల కోట్ల ధాన్యం రైస్ మిల్లర్ల దగ్గర ఉందంటున్నారు. దీనిలో వాస్తవం లేదు. కృష్ణా బోర్డుకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. పదేళ్లలో కృష్ణ వాటర్ ఎందుకు తగ్గిందో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి.

కేసీఆర్-జగన్ సీక్రెట్ మీటింగ్ లో చర్చించింది ఇదేనా? సంగమేశ్వర ప్రాజెక్ట్ 10 టీఎంసీల ద్వారా వెళుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? గోదావరిపై రెండు టీఎంసీల కోసం లక్షకోట్లతో ప్రాజెక్ట్ కట్టారు. కేసీఆర్-జగన్ అలయ్ బలయ్ చేసుకుని రాష్ట్రానికి నష్టం చేసింది నిజం కాదా? తెలంగాణకు.. బీఆర్ఎస్ వల్ల నష్టం జరిగింది. కేంద్రం పెట్టిన మినిట్స్ ను హరీశ్ రావు చదివి ఉంటే తెలుస్తుంది. తెలంగాణను నాశనం చేసింది, దోపిడీ చేసింది బీఆర్ఎస్. అందుకే ప్రజలు బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చారు.

Also Read : కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధం : రఘునందన్‌రావు

కృష్ణా బోర్డుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మేడిగడ్డలో డిజైన్, కన్ స్ట్రక్షన్ లో క్రిమినల్ నిర్లక్ష్యం ఉంది. మేడిగడ్డ ప్రాజెక్ట్.. ఫౌండేషన్ కూలిపోయే ప్రమాదం ఉంది. మేడిగడ్డలో.. డ్యామేజ్, నిర్లక్ష్యం అంతులేకుండా కనిపిస్తుంది. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది. కృష్ణాపై ఉన్న ప్రాజెక్ట్ లు గత ప్రభుత్వం ఉన్నట్లు గానే ఇప్పుడు కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా కాళేశ్వరం ఎలా ఉంటుంది?” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.