Home » criticized
ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా బొంద పెట్టటం ఖాయం అంటూ మరోసారి కేసీఆర్ పై విరుచుకపడ్డారు ఈటల రాజేందర్. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఫ్రెండ్లీ పార్టీలుగా మారుతాయని ఈటల జోస్యం చెప్పారు.
ఒకరు దేశాన్ని దోచుకుంటుంటే..మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీకీ పెద్ద తేడా ఏమీ లేదన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే అని విమర్శించారు.
ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ ను ప్రశంసించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్, బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
అమిత్ షా, మోడీ చర్యలపై ఢిల్లీ గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీ వేణుగోపాల్, చిందంబరంలకు గాయాలయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాత్, బుపేష్ బాగేల్ లపై పొలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు.
బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ.. ఆ పార్టీకి తమకు సంబంధం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వచ్చిన 8 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు.
లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఒక్కరికీ చేయలేదన్నారు. కేసీఆర్ రెండు పడకగదుల ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని అడిగారు. ప్రధాని ఆవాస్ యోజనను రాష్ట్రంలో అమలు చేయట్లేదని విమర్శించారు.
తెలంగాణలో 48 శాతం మిషన్ భగీరథ పనులు పాత లైన్లను ఉపయోగించుకుని జరిగాయని పేర్కొన్నారు. కానీ 100 శాతం తాగు నీరు మిషన్ భగీరథ వల్లనే సరఫరా చేస్తున్నామంటూ కేసీఆర్ చెప్తున్నారని తెలిపారు.
పాదయాత్ర చేసే బండి సంజయ్ అజ్ఞాని...ఏం తెలియదని విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, కారు కూతలు కూస్తూ పాదయాత్ర చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ కు ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పైనే కేటీఆర్ విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గానికి పారిపోయిన చరిత్ర కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అవినీతికి అవధులు లేవన్నారు. యాదగిరి నరసింహ స్వామి దేవాలయ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందన్నారు.