Revant Reddy : మోడీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ : రేవంత్ రెడ్డి

అమిత్ షా, మోడీ చర్యలపై ఢిల్లీ గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీ వేణుగోపాల్, చిందంబరంలకు గాయాలయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాత్, బుపేష్ బాగేల్ లపై పొలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు.

Revant Reddy : మోడీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ : రేవంత్ రెడ్డి

Revant

Updated On : June 15, 2022 / 7:41 PM IST

TPCC chief Revant Reddy has criticized PM Modi and CM KCR

మోడీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మోడీ ఆడించినట్టు ఆడడం కేసీఆర్ విధి అని ఎద్దేవా చేశారు. రేపు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం అని ఎన్నికలకు దూరంగా ఉండి బీజేపీని గెలిలించడానికి కేసీఆర్ సుపారి తీసుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్ నైతిక విలువలు లేని బజారు నేత తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని పెడతాడా…? అని ప్రశ్నించారు. కేసీఆర్ గైర్హాజరు అవడానికి ముందే ప్లాన్ చేశారని విమర్శించారు. కేసీఆర్ మమతా బెనర్జీ పిలిచినా సమావేశానికి రాలేదన్నారు.

Revanth Reddy Warns BJP : మిత్తితో సహా చెల్లిస్తాం, జైలుకెళ్లక తప్పదు- బీజేపీకి రేవంత్ రెడ్డి వార్నింగ్

బీహార్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకున్నారు..దీని నుండి అభ్యర్థిని భరిలో దింపుతారా? మోడీ పాల్పడ్డ ప్రతి అనాగరిక చర్యలో కేసీఆర్ కు భాగస్వామ్యం ఉందని విమర్శించారు. గాంధీ కుటుంబాన్ని దేశాన్ని విడదీసి చూడలేమని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని పదవులను త్యాగం చేసిన కుటుంబం అని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియాగాంధీని అవమానిస్తున్నట్లు మోడీ చర్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం అన్నారు.

అమిత్ షా, మోడీ చర్యలపై ఢిల్లీ గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీ వేణుగోపాల్, చిందంబరంలకు గాయాలయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాత్, బుపేష్ బాగేల్ లపై పొలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు. ఇవాళ ఏఐసిసి కార్యాలయంలో ఉన్న నేతలపై కూడా పోలీసులు దాడి చేశారని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు రేపు రాజ్ భవన్ లో ఉదయం 11 గంటలకు నిరసన ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఎల్లుండి జిల్లా కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసనలు చేయాలని ఏఐసిసి పిలుపునిచ్చినట్లు తెలిపారు.

రేపు ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉన్న పీజేఆర్ విగ్రహం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవాలని కోరారు. అక్కడి నుండి రాజ్ భవన్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రైల్వే స్టేషన్లు, పోస్ట్ ఆఫీస్ లు, ఎల్ఐసీ టెలికాం ఆఫీస్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీస్ ల వద్ద ఎల్లుండి నిరసనలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు.