Home » criticized
రాష్ట్రంలో అస్థిరత పెద్ద స్ధాయిలో నెలకొందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాలతో జనానికి తీవ్ర నష్టం అన్నారు. వికేంద్రీకరణ పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు.
టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు తీరుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
చంద్రబాబు డ్రామాను అందరం చూశామని సీఎం జగన్ అన్నారు. రాజకీయ అంజెండానే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలిపారు.
గత 45 రోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వరి ధాన్యం రోడ్లు, కల్లాల్లో ఎండకు ఏండీ వర్షానికి తడుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. సీఎం రైతుల పట్ల గజినిగా మారారని ఎద్దేవా చేశారు. రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కేసీఆర్ కు మూడు వారాలు సమయం ఇస్తున్నాను..ఆఖరి గింజ వరకు కొనాలి...లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు.
తెలంగాణలో ఏ రైతు బాయిల్డ్ రైస్ పండించరని...ధాన్యం మాత్రమే పండిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ సమస్య రైతులది కాదని..మిల్లర్లదని తెలిపారు.
ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే..గల్లీ బీజేపీ వరి వేయమని చెబుతుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యానికి కేసీఆరే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.