Bandi Sanjay : రైతుల పట్ల గజినిగా మారిన సీఎం కేసీఆర్ : బండి సంజయ్

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. సీఎం రైతుల పట్ల గజినిగా మారారని ఎద్దేవా చేశారు. రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.

Bandi Sanjay : రైతుల పట్ల గజినిగా మారిన సీఎం కేసీఆర్ : బండి సంజయ్

Bandi Sanjay (1)

Updated On : November 15, 2021 / 2:23 PM IST

Bandi Sanjay criticized CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. సీఎం రైతుల పట్ల గజినిగా మారారని ఎద్దేవా చేశారు. ఒకసారి పత్తి వేయమని, మరోసారి ధాన్యం వెయ్యమని, ఇంకొకసారి వద్దని రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాలోని అర్జాలాభావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రతి గింజ తానే కొంటానన్న సీఎం.. ఇప్పుడు మాట మారుస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంటే చాలు ముఖ్యమంత్రి గారు అని సంబోదిస్తూ మాట్లాడారు. రాత్రింబవళ్ళు కల్లాల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారని చెప్పారు. కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేస్తే రైతులకు తగిలాయని పేర్కొన్నారు. తాము ఇక్కడికి వస్తామని ముందుగానే షెడ్యూల్ ఇచ్చాము..అయినా పోలీసులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోళ్లను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.

Bandi Sanjay : బండి సంజయ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

గతంలో 1800 ఉన్న మద్దతు ధర ను కేంద్ర ప్రభుత్వం రూ.1960 కి పెంచిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గజిని వేషాలు మానుకోవాలని హితవుపలికారు. రైతుల దృష్టిని మళ్లించడానికి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించడానికి నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలలో పంట కొన్న తరువాత 48 గంటల్లో డబ్బులు ఇస్తున్నారని..మరి నువ్వేం చేస్తున్నావని ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్లకు బయపడబోనని తేల్చి చెప్పారు. రైతుల కోసం రాళ్ళ దాడికి, త్యాగాలకు, బూతులు పడడానికి కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

అంతకముందు అర్జాలబావి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన బండి సంజయ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు దారి మధ్యలోనే అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
టీఆర్ఎస్ కార్యకర్తలకు పోటీగా అటు బీజేపీ శ్రేణులు కూడా నినాదాలు చేశాయి. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.