Home » earthquake
టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాలు ఆరేళ్ల బాలికను భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత హో మంత్రిత్వ శాఖ ట్విటర�
టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి. రెండు దేశాల్లోనూ 15వేల మృతదేహాలను అధికారులు గుర్తించారు.
తాజాగా టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది. నిన్న మూడు సార్లు భూ ప్రకంపనలు రావడంతో టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి.
భూకంపం తీవ్రతకు టర్కీ, సిరియాలో పెనునష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. భారీ భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల్లో భూకంపం దా�
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ టర్కీలోని నుర్దగీకి 23కిలో మీటర్ల దూరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. సోమవారం తెల్లవారు జామున 4.17గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించాయి.
మణిపూర్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది.
ఇరాన్ లో భారీ భూకంపం సంభవించి, పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. ఏడుగురు మృతి చెందగా, మరో 440 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు చెప్పారు.
ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భూమి కంపించింది. 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఉత్తరాఖండ్ లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం పితోరగఢ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.