Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 21వేలకు చేరిన మృతుల సంఖ్య ..

టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్‌కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాలు ఆరేళ్ల బాలికను భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత హో మంత్రిత్వ శాఖ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 21వేలకు చేరిన మృతుల సంఖ్య ..

Turkiye Syria Earthquake

Updated On : February 10, 2023 / 8:22 AM IST

Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాధాలతో ఆ ప్రాంతమంతా విషాదంతోనే నిండుకొని ఉంది. ఎటు చూసిన కుప్పకూలిన భవనాల శిథిలాలు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ చలి తీవ్రతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మృతుల సంఖ్య నమోదవుతుంది. ప్రస్తుతం వరకు 21వేల మందికిపైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. వేలాది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాలో 15వేలు దాటిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద కొనసాగుతున్న అన్వేషణ

ఫిబ్రవరి 6వ తేదీన టర్కీ, సరియాల్లో భూకంపం సంభవించింది. అయితే అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది మంది కుప్పకూలి భవనాల శిథిలాల కిందినుంచి రెస్క్యూ సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, భూకంపం సంభవించి నాలుగు రోజులు అవుతుండటంతో శిథిలాల కింద చిక్కుకున్నవారు బతికే అవకాశాలు చాలా తక్కువని, ఆకలి, దాహం, చలితీవ్రతతో వారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Turkiye Earthquake: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న యువతి.. ఎలా బయటపడిందో చూడండి.. వీడియో వైరల్

మరోవైపు టర్కీకి 1.78 బిలియన్ డాలర్లు సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. టర్కీ, సిరియా దేశాలకు 85 మిలియన్ డాలర్లు సహాయాన్ని అమెరికా ప్రకటించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 70 దేశాల నుంచి రెస్క్యూ సిబ్బందితో పాటు ఇతర సామాగ్రి, ఆహారం, మందులను తరలించారు. భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ మూడు బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కోసం టర్కీకి చేరుకున్నాయి. దీనికితోడు భారత సైన్యానికి చెందిన వైద్య బృందం కూడా టర్కీకి చేరుకుంది. వీరు హటే పట్టణంలో ఫీల్డ్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులకు నిరంతరం వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాలు గురువారం ఆరేళ్ల బాలికను భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత హో మంత్రిత్వ శాఖ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.