Home » fire broke out
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుల్తాన్ పూర్ లోని మురికివాడలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇళ్లన్నీ తగలబడ్డాయి.
హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలో మరో అగ్నిప్రమాదం జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన మంటలు చెలరేగాయి.
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో తెల్లవారుజాము 3:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది.
వనస్థలీపురంలోని ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల రీ బాటనింగ్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్వాపార మేళాలో పదుల సంఖ్యలో దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని కార్ల షో రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో రెస్క్యూ ఆపరేషణ్ కొనసాగుతోంది. ఇప్పటికీ వర్కర్ల ముగ్గురి ఆచూకీ తెలియలేదు. వారి కోసం తోటి వర్కర్లు దీనంగా భవనం వెయిట్ చేస్తున్నారు.
హైదరాబాద్ లోని బేగంబజార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోల్డ్ షాప్ లో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.