Fire Broke Out : రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం.. ఘటనా ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్ ఎగ్జామ్ సెంటర్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.

Fire Broke Out : రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం.. ఘటనా ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్ ఎగ్జామ్ సెంటర్

fire broke out (2)

Updated On : March 18, 2023 / 9:37 AM IST

Fire Broke Out : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలకు తోడు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది.

10 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలోని స్కూల్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్ కూడా ఉండటంతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Secunderabad Fire Accident : సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో తీవ్ర విషాదం.. ఆరుగురు మృతి

అగ్నిప్రమాదం జరిగిన పక్కనే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. అక్కడి నుంచి స్కూల్ పిల్లలను అధికారులు ఖాళీ చేయించారు. నాలుగు రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్ వేస్ట్ ను తొలగించాలని చెప్పినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.