Home » Food
శరీరంలో వేడి చేసినప్పుడు ఎక్కువగా పంచదార నీళ్లను, సగ్గు బియ్యం పాయసాన్ని, నిమ్మ కాయ నీళ్లను, శీతల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇవి నీటిని ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలు మాత్రమే.
దీని వల్ల పరిమితికి మించి ఆహారం శరీర బరువుకు కారణమౌతుంది. కాబట్టి రాత్రి వేళ ఆలస్యంగా తింటున్నా, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం.
మాంసం ఎక్కువగా తినే వారు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పేగులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.
అధిక బరువుతో బాధపడేవారు అంబలిని తాగటం మంచిది. రాగి అంబలి తాగినా చాలా సేపు ఆకలి వేయదు. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం ఎక్కువగా తినాలనిపించదు.
మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందారం టీ ఉపయోగపడుతుంది.
నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచదు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది.
ప్రొటీన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచకుండా ఇన్సులిన్ ప్రతిస్పందనను పెంచుతుంది. కార్బోహైడ్రేట్లు లేదా స్టార్చ్‌తో మొదట ప్రోటీన్‌ను తీసుకుంటే, భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజా పండ్లు, కూరగాయలు బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయులు, రక్తపోటును నియంత్రిస్తాయి. రోగనిరోధకతను పెంచుతాయి. పండ్లు, కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి.
బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.